నవ్యాంధ్రప్రదేశ్ ని ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తోంది. గత ఐదు నెలల నుంచి రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక కొరత  సమస్యతో  రాష్ట్రంలో  ఎవరు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికులు కూడా ఇసుక కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలల నుంచి ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తుడటంతో... భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కరువవడంతో కుటుంబాన్ని పోషించలేక మనస్తాపం చెంది భవన నిర్మాణ కార్మికులు  ఆత్మహత్యలకు  పాల్పడుతున్నారు . ఇప్పటికే ఆరు మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతతో ఒక భవన నిర్మాణ రంగమే కాకుండా భవన  నిర్మాణ రంగానికి అనుబంధ రంగాల్లో కూడా తీవ్ర నష్టాలు ఏర్పడ్డాయి . 

 

 

 

 దీంతో వ్యాపారీలందరు  కూడా లబోదిబోమంటున్నారు. ఇసుక కొరత సమస్యతో రాష్ట్రం మొత్తం అల్లాడుతున్న తరుణంలో  ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని ఆరోపించిన జగన్... తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇసుకనే  నిలిపివేశారు అంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని... అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ నేతలు  అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ ఉన్నారంటూ  విమర్శిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని నిరసన  కార్యక్రమాలు చేపడుతున్నారు. 

 

 

 

 ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సెంట్రల్ పార్క్ లో లాంగ్ మార్చ్ తగలపెట్టారు.  రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత  సమస్యను  తీర్చాలంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు.ఈ లాంగ్ మార్చ్  నిర్వహించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడా కోరారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ పై  భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారని... ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య ఏర్పడటంతో  కార్మికుల బాధలు చూడలేక పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారని  జనసేన పార్టీ  నేతలు అంటున్నారు. కానీ అటు అధికార వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యను పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని... తన ఉనికిని చాటుకోవడానికి పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: