ఇసుక కొరతపై పవన్ పోరాటం అన్నారు. అంతవరకూ ఒకే అనుకోవచ్చు. కానీ ఎపుడైతే పవన్ దాన్ని రాజకీయం చేయదలచరో అప్పటినుంచే ఆ సమస్య తీవ్రత,   పవిత్రత అలా తగ్గిపోయాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక కార్యక్రమం చేపడితే దానికి లక్ష్యాలు జనాలకు చేరువ కావాలి. వారు నమ్మినట్లుగా ఉండాలి. అందులో చిత్తశుద్ధి కనిపించాలి. మరి పవన్ లాంగ్ మార్చ్ విషయంలో అది కనిపిస్తోందా అంటే లేదనే అంటున్నారు.


అయిదేళ్ళ పాటు ఇసుకను బంగారం కంటే ఘోరంగా మార్చేసి ఇసుక నుంచి లక్షలు, కోట్లు గడించవచ్చునని నిరూపించిందీ  టీడీపీ నేతలు. వారి మంత్రులు, సామంతులు  వారిని పక్కన పెట్టుకుని పవన్ చేసే లాంగ్ మార్చ్ లకు ఎంతటి విలువ ఉంటుందో ఆయన కనీసం గుర్తిస్తున్నారా అంటున్నారు వైసీపీ నేతలు. ఈ విషయంలో పవన్ టీడీపీకి పెద్ద పీట వేసి ఏమాశిస్తున్నారో అర్ధం కావడంలేదని అంటున్నారు.


పవన్ లాంగ్ మార్చ్ కి టీడీపీ మాజీ మంత్రులను పంపుతోంది. అందులో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఇసుక మాఫియా డాన్ గా గుర్తింపు పొందిన అచ్చెన్నాయుడును చీఫ్ గెస్ట్ గా పెట్టుకుని పవన్ ఏమి సందేశం సభ్య‌సమాజానికి ఇస్తారని వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్ నాధ్ ప్రశ్నించారు.   శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియాకు అచ్చెన్న నాయకత్వం వహించారని, ఒక్కొక్క‌ ఇసుక లారీకి పదివేల రూపాయలు వసూల్ చేసిన చరిత్ర అచ్చెన్నాయుడిదని గుడివాడ అన్నారు.


అటువంటి వారితో చేతులు కలిపి ఇసుక పోరాటం అంటే జనాలు ఎంతవరూ నమ్ముతారో పవన్ గుర్తించాలని గుడివాడ సూచిస్తున్నారు. మొత్తానికి పవన్ తొలి సమర నినాదమే కలుషితం అయిపోయిందని విమర్శలు వస్తున్నాయి. వామపక్షాల్తో కలసి పవన్ ఇలాంటి లాంగ్ మార్చ్ చేస్తే ఒక విలువ, గుర్తింపు వచ్చేదని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుతో రాజకీయంగా మరోమారు కలవడానికే లాంగ్ మార్చ్ వేదిక అవుతోందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: