ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ ఆ ప్రశ్నలకే పరిమితమైపోతున్నాడు. పోరాటాలు పవన్ కు కొత్తేమీ కాదు. ఫలితాలతో సంబంధం లేకుండా పోరాటాలు చేస్తున్న పవన్ ను అభినందించాల్సిందే..! కానీ ఏపీ రాజకీయాల్లో పవన్ ఓ పావులా మారాడనేది సుస్పష్టం. నిజానికి ప్రభుత్వాన్ని టీడీపీ నుంచి 23 మంది విమర్శించినా.. జనసేన నుంచి పవన్ ఒక్కడే స్పందించినా ఒకటే. కానీ ప్రభుత్వానికి పవన్ శత్రువులా మారిపోతున్నాడు. టీడీపీకి ఇక్కడే పవన్ ఓ వరంలా మారాడు.

 


రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వైసీపీటీడీపీ మధ్యే ఆధిపత్య పోరు ఉంటుంది. తాను కూడా ప్రత్యామ్నాయంగా ఉన్నానని ఉరుకుతోంది జనసేన. గత ఎన్నికల్లో పవన్ ఫ్యాన్స్, కార్యకర్తల ఓట్లు తప్ప జనసేనకు వచ్చిన ఓట్లు ఏమీ లేవని తేలిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తలెత్తిన సమస్యల్లో రాజధాని మార్పు.. ఇసుక సమస్య ప్రధానమైనవి. ఈ రెండు సమస్యల్లో ఇబ్బంది పడ్డ ప్రజలకు పవన్ కనబడ్డాడు. జనసేన కార్యాలయం బాధితులతో నిండిపోయింది. పవన్ కూడా ‘మీ తరపున పోరాడతాను’ అని ముందుకొచ్చాడు. కానీ పవన్ సాయం కోసం గుమ్మం తొక్కిన వారిలో అత్యధిక శాతం మొన్నటి ఎన్నికల్లో జనసేనకు ఓట్లేసిన వారు కారు. పోనీ ప్రజాపక్షం వహిస్తున్నాడు అనుకుంటే.. పవన్ స్పందనకి క్రియేట్ అవుతున్న సెన్సేషన్ తో వైసీపీజనసేన పోరాటంలా మారిపోతోంది. ఈ పోరు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి పరోక్షంగా హెల్స్ అవుతోంది.

 


లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు తెలుపుతోంది. కానీ ఫోకస్ అంతా పవన్ మీదే ఉంటుంది. మొన్న గుంటూరులో లోకేశ్ చేసిన ఐదు గంటల దీక్ష ఎందుకు చేశాడో ఎవరికీ అర్ధం కాలేదు. పవన్ తలపెట్టిన లాంగ్ మార్చ్ మాత్రం కష్టం జనసేనదే.. ఫలితం మాత్రం టీడీపీ తీసుకుంటుంది.. అది ఏ రూపంలో అయినా.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: