పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖలో జరగనుంది. మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి పాత జైలు రోడ్డు వరకూ ఉన్న రెండున్నర కిలోమీటర్ల మేర ఈ లాంగ్ మార్చ్ సాగుతుంది. ఇందులో జనసేన నాయకులతో పాటు, టీడీపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. జనసేన లాంగ్ మార్చ్ కి టీడీపీ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ ముగ్గురు మాజీ మంత్రులను కూడా ఎంపిక చేసి హాజరుకావాల‌ని కోరింది.


అందులో విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా  నుంచి అచ్చెన్నాయుడు ఉంటారు. వీరిలో మిగిలిన ఇద్దరు పాల్గొంటారు, అందులో ఎవరికీ డౌట్లు లేవు కానీ గంటా శ్రీనివాసరావు హాజరవుతరా అన్నదే పెద్ద చర్చగా ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే విశాఖ జిల్లా రాజకీయాల్లో టీడీపీతో అంటీ ముట్టనట్లుగా గంటా ఉంటూ వస్తున్నారు. ఆయన టీడీపీ సొంతంగా ఇసుక ఆందోళన చేపడితేనే  హాజరుకాలేదు, ఇపుడు జనసేన దానికి వస్తారా అన్నది పెద్ద డౌట్. ఇక అయ్యన్నపాత్రుడుతో గంటాకు సరిపడదని కూడా అంటారు. మరి ఈ ఇద్దరినీ కలిపి బాబు పంపించడం వెనక వ్యూహమేంటో చూడాలి.


మరో వైపు చూసుకుంటే గత ఏడాది విశాఖలో పవన్ టూర్ చేస్తూ గంటానే టార్గెట్ చేసుకున్నారు. ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే మెగా ఫ్యామిలీకి గంటా సన్నిహితుడు కావడం వల్ల పవన్ కి కౌంటర్ ఇవ్వలేదు, అదే సమయంలో పవన్ని, ఆయన పార్టీని గంటా పెద్దగా పట్టించుకోలేదని అంటారు  ఇపుడు కూడా గంటా చూపు అటు వైసీపీ, ఇటు బీజేపీ మీద మాత్రమే ఉంది తప్ప టీడీపీలో కొనసాగే అవకాశాలు లేవు అని ఓ వైపు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో గంటా ఇపుడు పవన్ లాంగ్ మార్చ్ కి వస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. అయితే పవన్ లాంగ్ మార్చ్ లో  గంటా  ఇలా కనిపించి అలా వెళ్ళిపోవచ్చు అని కూడా అంటున్నారు. మొత్తానికి అందరి చూపూ పవన్ లాంగ్ మార్చ్ తో పాటు గంటా మీద కూడా ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: