భారత్ ను కాశ్మీర్ విషయంలో తప్పుబడతామని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల స్వర్గాధామంగా ఆ దేశానికి బాగానే గుర్తింపు వస్తోంది. తాజాగా అమెరికా పాక్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది..


ఉగ్రవాదుల కార్యకలాపాలను అడ్డుకోవడంలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైందని అమెరికా విదేశాంగ శాఖ మండిపడింది. ఈ మేరకు తన వార్షిక నివేదికలో వాస్తవాలు వెల్లడించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల నిధుల సేకరణ, శిక్షణ, నియామకాలను కట్టడి చేయడంలో పాక్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అమెరికా ఫైర్ అయ్యింది.


దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగనివ్వబోమని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించినా 2018లో ఆ ప్రభావం కనిపించలేదని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందన్న నివేదిక ఉగ్రవాద సంస్థ నేతలు బహిరంగంగా తిరుగుతున్నా పాక్ ఏ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.


భారత్ - పాక్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాద దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని అమెరికా పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న అభ్యర్థులను పార్టీలు బరిలో దింపాయని అమెరికన్ నివేదిక వెల్లడించింది. ఉగ్రవాద నిరోధక చర్యల కోసం భారీగా నిధులు పొందుతున్న పాక్ చర్యలు మాత్రం నామమాత్రంగా చేపడుతోందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.


మరోవైపు పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాశ్మీర్ అంశంపై ఈనెలలో జరిగే భద్రతామండలి సమావేశంలో చర్చించాలన్న పాక్ డిమాండ్ ను ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఐరాస భద్రతా మండలి నవంబర్ సమావేశంలో కాశ్మీర్ అంశంపై చర్చించబోమని. ఈనెల సమావేశాలకు అధ్యక్షత వహించనున్న కరేన్ పియర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో చర్చించడానికి చాలా సమస్యలున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. మొత్తం 15 దేశాలు పాల్గొనే భద్రతా మండలి సమావేశంలో ప్రతి నెల ఒకరు అధ్యక్షత వహించనుండగా ఈ నెల సమావేశాలకు బ్రిటన్ ప్రతినిధి అధ్యక్షత వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: