తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు మరింత ఉధృతమవుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే కార్మికులు ఈనెల 5వ తేదీలోగా విధుల్లో చేరాలని ప్రకటించేశారు కెసిఆర్. ఇలా ఉంటే ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమ్మెను ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం యూనియన్ నేతల మధ్య అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొంది. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసి సమ్మె ను నిశితంగా గమనిస్తున్న బిజెపి జాతీయ నాయకత్వం దీనిని తమకు అనుకూలంగా మలచుకునే విధంగా  ప్రణాళికలు రచిస్తోంది.


ఈ క్రమంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే స్వరం పెంచటం ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్న దీనిని బిజెపి తమకు  అవకాశంగా మార్చేందుకు  ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వచ్చిన వ్యతిరేకతను పూర్తిగా తమకు అనుకూలంగా మ‌ల‌చుకుంటోంది.  కేసీఆర్ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్ వేసేందుకు  వ్యూహాలు రచిస్తున్నారు.కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని కెసిఆర్ సమ్మె మొదలైనప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు.


అయితే బిజెపి నేతలు కేసీఆర్ నెపం త‌మ‌పై నెట్టేస్తుండ‌డంతో అందుకు బదులుగా బీజేపీ నేత‌లు కౌంట‌ర్లు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటార్ వెహికల్ చట్టంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఎక్కడా చెప్పలేదని చెబుతున్నారు. చ‌ట్టంలో ఆర్టీసీని ప్రైవేటు ప‌రం చేయాల‌నీ, లేదా ఉన్న ఉద్యోగుల‌ను తొల‌గించెయ్యొచ్చు, ఆస్తుల‌ను అమ్ముకోవ‌చ్చు అనే అంశాలు లేవంటూ ధీటుగా బ‌దులిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె  తమపై నెపం వేసేందుకు  కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బిజెపి మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది.


ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను తాము మాత్రమే పరిష్కరిస్తామ‌న్న‌ వాతావరణం క్రియేట్ చేయడంలో బిజెపి సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ నేతలను ఢిల్లీకి తీసుకు వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేయించే పనిలో లక్ష్మణ్ ఉన్నట్టు తెలుస్తోంది. బిజెపి ఢిల్లీ పెద్దల సహకారంతోనే ఈ టూర్ ఉన్నట్లు  తెలంగాణలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కెసిఆర్ కు బిజెపి స్కెచ్ గీయగా ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని  చక్కగా వాడుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: