గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ అధినేత చంద్రబాబుకు అంత ప్రేమ ఎందుకు.. నేను పార్టీలో ఉండను అంటున్నా ఎందుకు బతిమాలుతున్నట్లు.. ?  తాను పార్టీని వదలి వెళ్లిపోతానంటున్నా చంద్రబాబు ఎందుకు బుజ్జ‌గిస్తున్నట్లు ? వల్లభనేని వంశీ పట్ల చంద్రబాబుకు అంత సాఫ్ట్ కార్నర్ ఎందు కు ? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. అంతేగాక ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రి సీనియ‌ర్ నేత‌ల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.


గ‌తంలో నలుగురు రాజ్యసభ స‌భ్యులు పార్టీని వీడి వెళ్లినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. అదే ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఎందుకింత తాపత్రయపడుతున్నార‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగు తోంది. వల్లభనేని వంశీ అంటే చంద్రబాబుకు చాలా ఇష్టం. 2006లో టీడీపీలోకి వచ్చినా మూడేళ్లలోనే టి క్కెట్ ఇచ్చారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చంద్రబాబు వల్లభనేని వంశీకి గన్నవరం సీటు ఇ చ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతోనే వల్లభనేని వంశీకి టిక్కెట్ ఇచ్చారు.


వల్లభనేని వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని వాట్సప్ మెసేజ్ పెట్టగానే దానికి ఓపిగ్గా చంద్రబాబు సమాధానమిచ్చారు. రెండో మెసేజ్ కు కూడా చంద్రబాబు చూసి ఊరుకోలేదు. వెంటనే రిప్లై ఇచ్చారు. తాను అండగా ఉంటానని భరోసా కూడా ఇచ్చారు. అయినా వల్లభనేని వంశీ వినడంలేదు. అ యినప్పటికీ వల్లభనేని వంశీని ఒప్పించడానికి పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను రాయ‌భారం పంపారు. వారితో చర్చలు స‌ఫ‌లం కాక‌పోయిన‌ప్ప‌టికీ  వంశీ కోసం చంద్రబాబు తన ప్రయత్నాలను విర‌మించుకోలేదు.


ఇందుకు కారణం కూడా చెబుతున్నారు. తాను పార్టీ నుంచి ఒక్క కార్యకర్తను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరని చంద్రబాబు స్పష్టం చేయదలచుకున్నారు. వల్లభనేని వంశీ అంశాన్ని రాష్ట్ర స్థాయి అంశంగా తీసుకెళ్లి సానుభూతి పొందాలనే ఉద్దేశ్యంతోనే బాబు ఇలాంటి ట్రిక్ ప్లే చేస్తున్న‌ట్లు స‌మాచారం. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు బతిమాలినా కూడా వంశీ వినలేదన్నది బలంగా జ నంలోకి వెళ్లాలన్నది ఆయన యోచనగా ఉంది. ఈక్ర‌మంలోనే వల్లభనేని వంశీతో పాటు వైసీపీని కూడా ఇరుకున పెట్టాలని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: