జనసేన  అధ్యక్షుడు పవన్ ఈరోజు విశాఖ కేంద్రంగా లాంగ్ మార్చ్ ను నిర్వహిస్తున్నారు.  ఈ లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి లాంగ్ మార్చ్ జరుగుతుంది.  మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మొత్తం 2.5 కిలోమీటర్ల మీద లాంగ్ మార్చ్ జరగబోతున్నది.  


లాంగ్ మార్చ్ లో పవన్ అభిమానులు, కార్యకర్తలు, ఇతర  పార్టీల నేతలు పాల్గొనబోతున్నారు.  రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఉపాధి కూలీలు మృత్యువాత పడుతున్నారు.  అడ్డా కూలికి కూలి దొరక్క కడుపులు మాడ్చుకుంటూబ్రతుకుతున్నారు వారికోసమే ఈ లాంగ్ మార్చ్. అయితే , పవన్ కళ్యాణ్ విశాఖను  ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారు.  ఎందుకు విశాఖలోనే ఈ లాంగ్ మార్చ్ చేస్తున్నారు.  కారణాలు ఏంటి తెలుసుకుందాం.  


గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గాజువాక కేంద్రంగా పోటీ చేశారు. గట్టి పోటీ ఇచ్చారు.  కానీ, కొన్ని కారణాల వలన అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు.  విశాఖపైనే జనసేన ఎక్కువ దృష్టి పెట్టింది.  ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర వెనకబడింది.  వెనకబడిన ఈ ఏరియాపై జనసేన ఎక్కువ దృష్టిపెట్టింది.  గతంలో పవన్ కళ్యాణ్...  ఉత్తరాంధ్రాలోనే ఎక్కువగా పర్యటించారు.  


రాయలసీమ నుంచి రాజకీయాలు బలంగా ఉన్నాయి.  అలానే కోస్తాఆంధ్రలో కూడా రాజకీయాలు బలంగా ఉంటాయి.  అభివృద్ధి కూడా ఉంటుంది.  కానీ, ఉత్తరాంధ్రా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది.  ఆ ప్రాంతంలో విశాఖ తప్పించి మరే ప్రాంతాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు.  విశాఖ పట్నం కూడా ఉక్కు, సముద్రం ఏరియా కావడంతో అభివృద్ధి చెందింది.  ఈ ప్రాంతం అభివృద్ధికి అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ.. ఎందుకో నాయకులు ఏ ఏరియాలపైనే దృష్టి జనసేన దృష్టి పెట్టింది.  ఈ ప్రాంతం నుంచే గతంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి.  అందుకే విశాఖను ఎంచుకున్నది.  అలా కాకుండా పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగానే విజయవాడ.. గుంటూరు మధ్యలో లాంగ్ మార్చ్ పెట్టి ఉంటె మరోలా ఉండేది.  


మరింత సమాచారం తెలుసుకోండి: