గత చరిత్రలో తెలుగుదేశం పార్టీకి చాల సాధించింది.  1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.  తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పధకాలు రూపొందించారు.  కిలో రెండు రూపాయల బియ్యం పధకం అప్పట్లో బాగా హైలైట్ అయ్యింది.  అదే పధకాన్ని ఇప్పటికి నడుపుతూనే ఉన్నారు.  ఈ పధకం వలన అనేక మంది ఆకలి తీరింది.  చంద్రబాబు కూడా పార్టీని విజయవంతంగా నడిపించారు.  


అయితే, 2019లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది.  అయితే, వైకాపా, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.  కానీ, ఈ జనసేన పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది.  175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్కస్థానంలో మాత్రమే జనసేన విజయం సాధించింది.  పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం విశేషం.  పవన్ కళ్యాణ్ ఓటమి తరువాత కూడా పార్టీని నడుపుతున్నాడు.  


గతంలో కంటే కొంత దూకుడును ప్రదర్శించాలని చూస్తున్నాడు.  సమస్యలు ఉన్న చోట జనసేన ఉంటుంది... సమస్యలను ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లడమే కాకుండా.. అవసరమైతే ప్రజల కోసం ప్రభుత్వంతో కొట్లాటకు దిగేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పేందుకు జనసేన  ప్రయత్నం చేస్తోంది.  ఈ ప్రయత్నాలు ఒక్కక్కటిగా కలిసి వస్తున్నాయి.  ప్రభుత్వం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో లాంగ్ మార్చ్ చేస్తోంది.  


లాంగ్ మార్చ్ తో ప్రజల తరపున జనసేన పోరాటం చేస్తుంది అని చెప్పడమే దీని ఉద్దేశ్యం.  అంతేకాదు, తాము చేసే ప్రతి పోరాటాన్ని ప్రతి పక్ష పార్టీలను కూడా కలుపుకొని వెళ్తామని, ప్రజల కోసం పోరాటం చేయడం తప్పించి.. సంపాదన కోసం కాదని చెప్పేందుకు పవన్లాంగ్ మార్చ్ చేస్తున్నారు.  ఇసుక కొరత అన్నది రాష్ట్రంలో తీవ్రంగా మారింది.  ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ పోరాటం చేస్తున్నారు.  మరి ఈ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: