ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమం సంచలనం సృష్టిస్తోంది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఇసుక విషయంలో అవలంబిస్తున్న వైఖరి ఖండించడానికి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఈ యాత్ర ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ఇతర పార్టీలను కూడా ఆహ్వానిస్తూ స్వయంగా ఫోన్ చేస్తూ ఎలాగైనా విశాఖలో లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకుని అన్ని పార్టీలను ఆహ్వానించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు లెఫ్ట్ పార్టీ నేతలు.


పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి తాము హాజరు కావడం లేదని మద్దతివ్వడం లేదని స్పష్టం చేసి జనసేన అధినేత కు కళ్లు బైర్లు కమ్మే షాకిచ్చారు. దీంతో ఈ విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో వైసీపీ నేతలు జనసేన తలపెడుతున్న కార్యక్రమం కేవలం ఉనికి కోసమే అంటూ...విమర్శలు చేస్తూ లెఫ్ట్ పార్టీలు ఇది తెలుసుకొని ముందుగానే బయటపడ్డారని కామెంట్లు చేస్తున్నారు.


అయితే లెఫ్ట్ పార్టీ నేతలు జనసేన అధినేత కు షాక్ ఇవ్వడానికి గల కారణం చూసుకుంటే...పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీని కూడా ఆహ్వానించడంతో...ముఖ్యంగా ఎప్పటి నుండో మిత్రపక్షంగా ఉన్న తమను సంప్రదించకుండా లెఫ్ట్ పార్టీల కు విరుద్ధంగా ఉండే బీజేపీ పార్టీని పవన్ కళ్యాణ్ కలుసుకోవడంతో..సిపిఐ సిపిఎం పార్టీ నేతలు పవన్ అవలంబించిన ఈ వైఖరి నచ్చకపోవడంతో పవన్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి హాజరు కాకుండా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడానికి లెఫ్ట్ పార్టీ నేతలు డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే లాంగ్ మార్చ్ కార్యక్రమం జనసేన మరియు లెఫ్ట్ పార్టీల మధ్య దూరం పెంచింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: