పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు ముహూర్తం సెట్ అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో లాంగ్ మార్చ్ కు అంతా సిద్ధం చేసుకున్నారు.  లాంగ్ మార్చ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా.. ముందు రోజు అర్ధరాత్రి హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే.  లాంగ్ మార్చ్ కు అనుమతి ఉన్నా.. భారీ బహిరంగ సభ విషయంలో మాత్రం అడ్డంకులు ఏర్పడ్డాయి.  మొత్తానికి అనుకున్న విధంగా అడ్డంకులు తొలగిపోయి తిరిగి మాములు యధావిధిగా లాంగ్ మార్చ్ జరగబోతున్నది.  


ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేయడం వలన రాష్ట్రంలో ఇసుక కొరత తీరుతుందా.. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను తీరుస్తుందా? సమస్య గురించి పవన్ కళ్యాణ్ చెప్తేనే వైకాపా ప్రభుత్వం వింటుందా.. ఆ సమస్యను గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా.. ఏమో చెప్పలేం.  రాష్ట్రంలో ఈ ఇసుక కొరత ఏ స్థాయిలో ఉన్నదో చెప్పేందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  పవన్ కళ్యాణ్ తో పాటుగా ఈ లాంగ్ మార్చ్ లో ప్రతిపక్ష పార్టీలు కూడా పాల్గొనబోతున్నాయి. 


ఎవరికీ వారు ఈ లాంగ్ మార్చ్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తారు. ఇసుక కొరత రాష్ట్ర సమస్య కాబట్టి దీన్ని ఎత్తి చూపేందుకు పవన్ తో చేతులు కలిపారు.  పవన్ తో చేతులు కలిపిన ప్రతి పక్షాలు ఏ మేరకు సహకరిస్తారో చూడాలి.  తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలు అచ్చన్నాయుడు, గంటా, అయ్యన్నపాత్రుడు పాల్గొంటున్నారు.  


అయితే, ఈ లాంగ్ మార్చ్ కు బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ నుంచి సపోర్ట్ లభించినా.. అది కేవలం సంఘీభావం తెలపడం వరకు మాత్రమే ఉంటుంది.  అంతకు మించి ఉండదని, ఈ లాంగ్ మార్చ్ లో తమ ప్రతినిధులు ఎవరూ కూడా పాల్గొనబోవడం  ఆయా పార్టీలు స్పష్టం చేశాయి.  తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు మాత్రమే ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొంటున్నారు.  తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక్కటే అని చెప్పడానికి వైకాపాకు ఇదొక మంచి అవకాశంగా చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: