2014 ఎన్నికల సమయం నుండి చంద్రబాబుతో పాటు ఎక్కువగా జగన్ ని టార్గెట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2014 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి తెలుగుదేశం పార్టీ అవినీతి చేస్తే చొక్కా కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తా నేను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు ప్రశ్నించడానికి పార్టీ ని పెట్టను అంటూ ప్రసంగాలు చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి బీభత్సం గా కృషి చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కనీసం న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కూడా డొంకతిరుగుడు రాజకీయాలు చేస్తూ యూటర్న్ రాజకీయాలు చేస్తూ కేంద్రంలో ఏపీ రాష్ట్రం పట్ల చులకన భావన కలిగించే విధంగా అప్పట్లో మెలగటం తో 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు పూర్తిగా చంద్రబాబుని పక్కన కూర్చోపెట్టారు. త్రుటిలో పోయే విధంగా ప్రతిపక్షానికి పరిమితం చేశారు.


అయితే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి విషయంలో ఏ ఒకనాడు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ తాజాగా జగన్ అధికారంలోకి వచ్చి కేవలం వరదల వల్ల వర్షాల వల్ల ఇసుక విషయంలో కొరత రావడంతో దీన్ని అదునుగా చేసుకొని జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్...ప్రజలలో వ్యతిరేఖత తీసుకురావటానికి పడుతున్న కష్టాలకు చాలా పార్టీలు ఛీ కొట్టినట్లు..పవన్కళ్యాణ్ తలపెట్టిన విశాఖ లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని వ్యతిరేకించినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళితే లాంగ్ మార్చ్ కార్యక్రమం ద్వారా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా స్వయంగా ఫోన్ చేసినా గాని.., పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టిన పార్టీలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఆ పార్టీల లిస్ట్ చూస్తే బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా.  ఈ పార్టీలు గతంలో పవన్ కళ్యాణ్ కి అండగా ఉండేవి...కానీ తాజా పరిణామాలను బట్టి పవన్ కళ్యాణ్ ని పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ పూర్తిగా తొత్తులుగా మారడం తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ 2019 ఎన్నికల రూపంలో ఇవ్వటంతో ఆ పార్టీ కి పట్టిన గతే తమ పార్టీలకు పడుతుందేమోనన భయంతో పవన్ కళ్యాణ్ ని మరియు చంద్రబాబు పార్టీ తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినట్లు వార్తలు వినపడుతున్నాయి.


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని ప్రతి సామాన్యుడికి అర్థం అవుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ తన ఉనికి కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల అటువంటి కార్యక్రమానికి తమ పార్టీల నుండి వెళ్లి ఏపీ ప్రజల ముందు అబాసుపాలు కాకూడదని విశాఖ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ నీ బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా వంటి పార్టీలు పక్కన పెట్టినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. అయితే పవన్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమం కి మద్దతు పలికిన ఒకే ఒక పార్టీ అది తెలుగుదేశం పార్టీ. దీంతో ఇప్పుడు విశాఖ నగరంలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ఇసుక విధానం లో అవలంబించిన వైఖరిని ఖండించడానికి...పవన్ కళ్యాణ్ తో పాటుగా లాంగ్ మార్చ్ కార్యక్రమానికి రెడీ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు జనసేన పార్టీ సైనికులు . మరి పవన్ తలపెట్టిన ఈ కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: