తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి సరిగ్గా 30 రోజులు అవుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వారి తరపున పూర్తి ఉచితంగా వాదిస్తాం అని నవ తెలంగాణ అడ్వకేట్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుధా నాగేందర్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన సుధా నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                                 

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మా సంపూర్ణ మద్దతు వారికే. ఆర్టీసీని ప్రైవేటీకరించడం రాజ్యాంగ విరుద్ధమని అయన తెలిపారు. కాగా ఆత్మహత్యలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలని అయన డిమాండ్‌ చేశారు.

                                    

కాగా నేడు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి గ్రామగ్రామన ఆర్టీసీ సమ్మె ఉద్దేశాల వివరణ ఇస్తున్నారు, 4న డిపోల దగ్గర నిరసన ప్రదర్శనలు, 5న రహదారుల దిగ్బంధనం, 7న ప్రజాసంఘాల ప్రదర్శనలు, 9న 'చలో ట్యాంక్‌బండ్‌' ఉంటుంది అని అయన అన్నారు. మరి ఈ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై కాస్త కూడా కనికరించడం లేదు అనే ఈ సమ్మెతో అర్థం అవుతుంది అని నెటిజన్లు అంటున్నారు.

                      

మరింత సమాచారం తెలుసుకోండి: