సాఫ్ట్‌గా ఉంటూ సంప్రదాయాలకు, విలువలకు గౌరవం ఇచ్చే ఇండియన్ అబ్బాయిలు అంటే ప్రపంచంలో చాలా మంది దేశాల అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఇతర దేశాల్లో విద్య, ఉద్యోగాల్లో ఉన్న ఇండియన్ అబ్బాయిల ప్రేమలో పడి మరీ ఇండియాకు వచ్చి ఇక్కడే మన దేశ అబ్బాయిలను పెళ్లాడుతున్నారు. తాజాగా కర్నాటకలోని బళ్లారికి చెందిన ఓ యువకుడు రష్యాకు వెళ్లి అక్కడ వైద్య
విద్య అభ్యసిస్తున్నాడు.
అక్కడ అతడికి అంతా కొత్తగా ఉంది. ఈ సమయంలో అతనికి హుడ్నావిచ్ అనే
అమ్మాయి పరిచయం అయింది… తన క్లాస్ మేట్, తాను ఉండే వీధిలోనే ఉంటుంది. ఇద్దరు కలిసి రోజు బండి మీద కాలేజికి వెళ్లి వస్తూ ఉండే వారు. అతడి సాఫ్ట్‌కార్నర్ నచ్చడంతో ఆమె అతడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల గురించి అడిగింది. చివరకు అతడికి ఏం కావాలో అది ఇవ్వడం దగ్గర నుంచి తన తల్లిదండ్రులను పరిచయం చేసే వరకు వెళ్లింది.
ఆ తర్వాత ఆమె అతడిని ఇండియాకు తీసుకు వెళ్లాలని కోరగా అతడు అందుకు అంగీకరించడు. చివరకు ఆ యువకుడు ఆమె తనపై ఇష్టం పెంచుకుంటోందని గ్రహించి కారణం అడగగా అతడి సాఫ్ట్‌కార్నర్‌తో పాటు శుభ్రంగా ఉండడంతో పాటు హెల్ఫింగ్ నేచర్ ఆకట్టుకుందని చెప్పిందట. అందుకనే తాను తన కుటుంబం కంటే నీతోనే ఎక్కువుగా గడిపేందుకు ఇష్టపడతానని చెప్పిందట. చివరకు వారిద్దరు ఇరు వైపులా పెద్దలను ఒప్పించి
పెళ్లి చేసుకున్నారు.
ఇది ఈ ఒక్క జంట విషయంలో మాత్రమే జరగలేదు.
ఇండియా నుంచి రష్యా, ఉక్రెయిన్,
ఉజ్బెకిస్తాన్ దేశాల్లో వైద్య
విద్య అభ్యసించేందుకు వెళుతున్న చాలా మంది అబ్బాయిల విషయంలో జరుగుతోంది. రష్యతో పాటు పాత రష్యన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన అమ్మాయిలు అందరూ మన ఇండియన్ అబ్బాయిలను ఇష్టపడి పెళ్లాడుతున్నారట. అబ్బాయి నచ్చితే వాళ్ళు ఎంత వరకు అయినా వెళ్ళడానికి సిద్దంగా ఉంటారట.