నిన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీల్లో భాగంగా యూసఫ్ గూఢలోని ఎల్ ఎల్ నగర్ కు చెందిన షేక్ సయీద్ అనే వ్యక్తి బైక్ ను ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. షేక్ సయీద్ బైక్ ను తనిఖీ చేసిన తరువాత షాక్ అవ్వటం ట్రాఫిక్ పోలీసుల వంతయింది. 75 పెండింగ్ చలానాలు షేక్ సయీద్ బైక్ పై ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. 
 
షేక్ సయీద్ చాలా సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించటంతో ఆ ఉల్లంఘనలకు సంబంధించిన చలానాలు జారీ అయ్యాయి. 13,125 రూపాయలు షేక్ సయీద్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు చెల్లించాల్సి ఉంది. భారీ మొత్తంలో  చెల్లించాల్సి ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు షేక్ సయీద్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు షేక్ సయీద్ కు చలానాలకు ఫైన్ చెల్లించి బైక్ తీసుకొనివెళ్లమని సూచించారు. 
 
ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు ఎవరూ అతీతులు కారని షేక్ సయీద్ కు చెప్పారు. తప్పకుండా ఇకనుండి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు షేక్ సయీద్ కు సూచించారు. గతంలో హైదరాబాద్ లో హిమాయత్ నగర్ వై జంక్షన్ లో పోలీసులు చేసిన తనిఖీల్లో కృష్ణప్రసాద్ అనే వ్యక్తి బైక్ కు ఏకంగా 135 చలానాలు జారీ అయ్యాయి. వాహనదారులు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంతో నిబంధనలు క్రాస్ చేస్తూ ఉంటారు. 
 
బైక్ పై వెళ్లేవారు హెల్మెట్ పెట్టుకోకపోయినా కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా వాహనాల నంబర్ పై చలానాలు జారీ అవుతూ ఉంటాయి. నో పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని పార్క్ చేసినా కూడా పోలీసులు చలానాలు జారీ చేస్తారు. చలానాలు ఎక్కువగా జారీ అయితే కొన్ని సందర్భాల్లో వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసి వాహనదారుడికి కౌన్సిలింగ్ సైతం ఇస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: