జగన్ ప్రభుత్వ తీరు వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ప్రతిపక్షాలు గోల చేస్తుండగా ఇసుక కొరతపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలో లాంగ్ మార్చ్ నిర్వహించనుంది జనసేన పార్టీ. ఈ ఆదివారం మధ్యాహ్నం అంటే 3వ తారీఖున 3 గంటలకు మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి లాంగ్ మార్చ్ ప్రారంభం కానుంది. అనంతరం ఉమెన్స్ కాలేజీ ఎదురుగా బహిరంగ సభ నిర్వహిస్తారు.


ఇకపోతే లాంగ్ మార్చ్ కు వామపక్ష పార్టీలే కాకుండా టీడీపీ కూడా మద్దతు పలికింది. ఇక పవన్ తలపెట్టిన ఈ కార్యక్రమం పై  మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ. టీడీపీకి అనుబంధంగా జనసేన పార్టీ వ్యవహరిస్తోందని, పవన్‌ చేసేది లాంగ్‌ మార్చ్‌ కాదు.. రాంగ్‌ మార్చ్‌ అని మంత్రి అనిల్‌ కుమార్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో పడిన వర్షాలతో నదులన్ని నీటితో నిండి ఉన్నాయన్న విషయం పవన్‌కి తెలియడం లేదా?.. ఇసుక పేరుతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు, పవన్‌పై ధ్వజమెత్తారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ .


గతంలో టీడీపి టీడీపీ హయాంలో ఐదేళ్లు ఇసుక మాఫియా చేసిన దారుణాలపై పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్‌ మార్చ్‌ వైజాగ్‌లో కాకుండా కృష్ణా,  గోదావరి నదుల ఒడ్డున చేయాలన్నారు. రాజకీయ ఉనికి కోసమే పవన్‌, చంద్రబాబు ఇసుక ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.


ఇక ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుముఖం పడుతున్నాయని.. మరో వారం రోజుల్లో రాష్ట్రంలో ఇసుక కొరత తీరబోతుందన్నారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయ్యాలని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సూచించారు. సమస్య ఉంటే సీఎం వద్దకు వచ్చి చెప్పొచ్చుగా.. అలా ఎందుకు చెయ్యడం లేదన్నారు. సీఎం జగన్‌ని కలిసి ఎదురుగా మాట్లాడే అంత ధైర్యం పవన్‌, చంద్రబాబుకు లేవని ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు...


మరింత సమాచారం తెలుసుకోండి: