పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నది.  నిర్మాణ రంగం కుదేలవ్వడంతో ఆ రంగంపై ఆధారపడిన రియల్ ఎస్టేట్.. రియల్ ఎస్టేట్ పై ఆధారపడిన నిర్మాణాలు నిర్మిస్తున్న వ్యాపారులు, తాపిపని చేసేవారు.. రోజువారీ కూలీలు  ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బయట పడాలి అంటే.. తిరిగి నిర్మాణ రంగం ఊపందుకోవాలి.  అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా, నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి.  ఒక్క ఇసుక తప్పా.  


నిర్మాణ రంగంలో ఇసుక పాత్ర చాలా కీలకం.  ఇసుక లేకుంటే.. ఒక్కఅడుగు కూడా ముందుకు పడదు.  అందుకే ఇసుక అవసరం చాలా ఉన్నది.  గత కొంతకాలంగా ఇసుక లేక నానా తంటాలు పడుతున్నారు.  ఇసుక కొరతను నివారించాలని, అందరికి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తున్నారు.  విశాఖ కేంద్రంగా ఈ లాంగ్ మార్చ్ కు పవన్ శ్రీకారం చుట్టారు.  


2.5 కిలోమీటర్ల మేర ఈ లాంగ్ మార్చ్ జరగబోతున్నది.  ఈ లాంగ్ మార్చ్, సభను నిర్వహించి వదిలేస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుందా అంటే రాదనీ చెప్పాలి.  ప్రభుత్వంలో కదలిక వచ్చేవరకు, ఒత్తిడి వచ్చేవరకు నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి.  అపుడే ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది.  నిజంగానే ఇసుకను తవ్వడం ఇబ్బందులుగా ఉంటె... పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తుంది.  


అవసరం అనుకున్నప్పుడు తీసుకురాక తప్పదు.  కరెంట్, నీళ్లు, ఇతర విషయాల్లో పక్క రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇసుక కొరత ఉన్నప్పుడు దాన్ని కూడా పక్కరాష్ట్రాల నుంచి తెప్పించుకుంటే బాగుంటుంది కదా.  నిజంగానే ఇసుక కొరత ఉంటె ప్రభుత్వం ఇలా చేసి కొంత సమస్యను తగ్గించవచ్చు.  లేదు ప్రభుత్వం కావాలనే కృత్రిమ కొరతను తీసుకొస్తే మాత్రం దానిపై పోరాటం తప్పదు మరి.  చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: