కన్నతల్లినే కర్కశంగా చంపిన కీర్తి ఇప్పుడు జైలు ఊసులు లెక్కపెడుతున్న విషయం గురించి తెలిసిందే. సరిగ్గా 18 సంవత్సరాలు కూడా నిండి నిండకుండా ఉన్న వయసులోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడిన కీర్తి చేసిన పని అందరిని విస్తుపోయేలా చేసింది. 9 నెలల పరిచయం ఉన్న ప్రియుడి కోసం తనను 9 నెలలు కడుపులో మోసిన తల్లిని కడతేర్చిన కీచక కూతురు కటకటాల వెనుక ఇప్పుడు ఎంచేస్తుందో తెలుసా....??

దాదాపు పోలీసుల చెరలో మూడు నాలుగు రోజులు ఉన్న తనలో తప్పు చేశానన్న భావన అసలు ఏ కోణంలో కూడా కనిపించలేదని పైగా ఆ చెర నుంచి జైలుకు వెళ్లే సమయంలో పోలీసులతో 'బై సార్ మళ్ళీ కలుస్తానంటూ చెప్పి మరీ వెళ్లిందని చెబుతున్నారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన అమ్మాయి జైలులోకి వెళ్ళాక ఎలా ఉంటుంది?? అన్న ప్రశ్నకు తెలిసిన ఆసక్తికర అంశాలు చూస్తే ఆశ్చర్యపోక మానరు.

ఏ నేరస్థుడు అయినా మొదట జైలుకు వెళ్లాక తీవ్ర పశ్చాత్తాపంతోనూ, మనోవేదనతోను బాధ భాదపడుతుండడం, కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా , కలవకుండా ఉండటం సహజం. ఆ ప్రదేశం, ఆ మనుషులు, ఆ వాతావరణం అలవాటు పడే వరకు వారికంటూ ఒక కొత్త లోకాన్ని సృష్టించుకుని అందులోనే గడిపేస్తూ ఉంటారు. అయితే కీర్తి మాత్రం తనేదో విహార యాత్రకు వచ్చినట్టు ఆ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ అక్కడున్న ఖైదీలతో కుశల ప్రశ్నలు వేస్తూ తిరుగుతుంటే అక్కడి అధికారులు విస్తుపోయి చూస్తున్నారట. 

తల్లిని చంపి ఇంతటి సంచలనానికి తెరలేపిన కీర్తి పై జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి అప్రమత్తంగా ఉన్నారట. అక్కడే ఉన్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీల బ్యారక్ లోనే ఉంచి తన మాటతీరు ,నడవడిక లాంటివాటిని ఆ ఖైదీల ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం. అయితే కీర్తి అక్కడున్న ఖైదీలకు... అడిగినవారికి అడగని వారందరికీ తాను అసలు జైలుకు ఎందుకు వచ్చిందో... ఎలా వచ్చిందో ఆ విషయాలన్నీ కథలు కథలుగా తానే చెప్పుకుంటోంది. ఇదంతా చూస్తున్న పోలీసు అధికారులు తనకు కౌన్సిలింగ్ ఇస్తూ తన మానసిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి ఎర్రగడ్డ మానసిక చికిత్సలాయానికి పంపించాలని అనుకుంటున్నారు అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: