తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. స‌మ్మె ఇప్ప‌టికే నెల రోజుల‌కు చేరువైన నేప‌థ్యంలో అటు కేసీఆర్‌, ఇటు ఆర్టీసీ జేఏసీ నాయ‌కులు ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో తీవ్ర ఒత్తిడికి గురైన ప‌లువురు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. గ‌త మూడు నాలుగు రోజుల్లోనే ఐదారుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ రోజు హ‌న్మ‌కొండ‌కు చెందిన ర‌వీంద‌ర్ మృతిచెందారు.


స‌మ్మె నేప‌థ్యంలో విధుల‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో భ‌విష్య‌త్తు ఏంట‌న్న ఆందోళ‌న‌కు గురైన ఆయ‌న ర‌వీంద‌ర్‌రెడ్డి మూడు రోజుల క్రిత‌మే గుండెపోటుకు గుర‌వ్వ‌గా ఆయ‌న్ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ గ‌త అర్ధ‌రాత్రి మృతిచెందారు. ఇక పోలీసులు ఆయ‌న్ను భారీ కాన్వాయ్ మ‌ధ్య వ‌రంగ‌ల్‌కు తీసుకువ‌చ్చారు. ర‌వీంద‌ర్‌ మృత దేహాన్ని వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూరుకు తరలించ‌డంతో రవీందర్ ఇంటికి కార్మికులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు.


దీంతో ఆత్మకూరులో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కండక్టర్ రవీందర్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన ప‌ర‌కాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చ‌ల్లా ధర్మారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా కార్మికులంతా నినాదాలతో హోరెత్తించారు. ఆయ‌ను ర‌వీంద‌ర్ మృత‌దేహాం ద‌గ్గ‌ర‌కు చేరుకునేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా కార్మికులు ఆయ‌న్నుముందుకు వెళ్ల‌నీయ‌లేదు. దీంతో ఆయ‌న అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


ఏదేమైనా తెలంగాణ‌లో జ‌రుగుతోన్న ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో అటు ఆర్టీసీ కార్మికులు ఏకంగా ప్రాణాలు కోల్పోతుంటే ఇటు సామాన్య ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇక్క‌ట్లు అన్నీ కావు. మ‌రోవైపు కేసీఆర్ మాత్రం తాను ఈ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గే ప్ర‌శ‌క్తే లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అంతే కాకుండా విధుల‌ను బ‌హిష్క‌రిస్తోన్న కార్మికులు అంద‌రూ ఈ నెల 5వ తేదీలోగా విధుల్లో చేరాల‌ని అల్టిమేటం జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ స‌మ్మె ఎటు మ‌లుపులు తిరుగుతుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: