పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను ఏర్పాటు చేశారు.  మద్దిలపాలెం నుంచి లాంగ్ మార్చ్ మొదలైంది.  లక్షలాది మంది జనసేన కార్యకర్తలు ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు.  ఉత్సాహంగా ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొన్న అనంతరం... సభ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు.  సభ ప్రారంభమైన కొద్దిసేపటికి సభలో కలకలం రేగింది.  


అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో సడెన్ గా సభలో హడావుడి, గందరగోళం నెలకొంది.  సభ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ నుంచి వచ్చే కరెంట్ సప్లై వలన షార్ట్ సర్క్యూట్ జరిగింది.  ఈ షార్ట్ సర్క్యూట్ వలన ఇద్దరు గాయపడ్డారు.  దీంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది.  వెంటనే జనరేటర్ ను ఆపేశారు.  గాయపడిన ఇద్దరినీ హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.  ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.  


2014లో జరిగిన ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేనలు కలిసి పనిచేశాయి.  అయితే, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ బయటనుంచి మద్దతు ఇచ్చారు.  ప్రభుత్వంలో జాయిన్ కాలేదు.  సపోర్ట్ చేసినా... ప్రజల సమస్యలు తీర్చకుంటే మాత్రం ప్రజల పక్షాన పోరాటం చేస్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.  ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ కావడంతో పార్టీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచాడు పవన్.  


2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.  తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలుచుకోగా, జనసేన ఒక్కసీటు మాత్రమే గెలుచుకోగలిగింది.  ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ జనసేన పార్టీ మాత్రం ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధం అయ్యింది.  తన చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలుస్తానని ఇప్పటికే పవన్ తెలిపారు. రెండు పార్టీలు కలిసి ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొనడం ప్రకృతికి కూడా ఇష్టం లేదని అందుకే ఇలా సభలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని కొందరు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: