మెగా బ్రదర్ నాగబాబు ఒక మంచి నటుడిగా  జబర్దస్త్ జడ్జిగా తెలుగు ప్రేక్షకులకు కొసమెరుపు. అయితే జబర్దస్త్ లో నవ్వులు పండించే నాగబాబు... తాజాగా మొన్న జరిగిన ఎలక్షన్లలలో  నా ఛానల్ నా ఇష్టం అంటూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ భిన్నమైన రీతిలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలపై ఎన్నో విమర్శలు గుప్పించాడు నాగబాబు. అయితే తాజాగా ఎన్నికల్లో  నాగబాబు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయితే తాజాగా మరోసారి ఓ పిట్ట కథ చెప్పి టిడిపి వైసిపి పార్టీలలో ఏ పార్టీ బెటరో తనదైన స్టైల్లో చెప్పేసాడు మెగా బ్రదర్ నాగబాబు. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. కాగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కి  ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

 

 

 

 కాగా పవన్ కళ్యాణ్  లాంగ్ మార్చ్ కి టిడిపి నుంచి ముగ్గురు ముఖ్య నేతలు... బిజెపి నేతలు హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అనంతరం సభ కోసం  ఓల్డ్ జైల్ రోడ్ లోని ఉమెన్స్ కాలేజీ ఎదుట  వేదిక  నిర్మించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన మెగా బ్రదర్ నాగబాబు తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతపై  పలు కీలక వ్యాఖ్యలు చేసిన నాగబాబు... చివర్లో తన ప్రసంగాన్ని ఓ పిట్ట కథతో  ముగించారు. టిడిపి వైసిపి పాలనను కంపేర్ చేస్తూ ఓ పిట్ట కథ చెప్పారు. అయితే నాగబాబు చెప్పిన  పిట్టకథతో  అక్కడున్న ప్రజలు అందరూ హెరొత్తిపోయారు . 

 

 

మెగాబ్రదర్ నాగబాబు చెప్పిన పిట్ట కథ ఆయన మాటల్లో...ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు వాడు వచ్చి పోయే వాళ్ళను అస్తమానం తిడుతూ ఉండే వాడు. వాడి దెబ్బకు జనాలు హడలిపోయేవాళ్లు... ఏంట్రా బాబు వీడి తిట్లు  భరించలేకపోతున్నాం  ప్రాణాలు తీసేస్తున్నాడు  అంటూ విసుక్కునేవారు. వీడు చచ్చిపోతే  బాగుండు అనుకునేవారు.. కొన్నాళ్లకు వాడు చచ్చిపోయే టైం రానే వచ్చింది అప్పుడు తన కొడుకుని పిలిచి నాకు మంచి పేరు తీసుకురావాలని తన కొడుకుని కోరాడు ఆ వ్యక్తి. జనాలని ఎంతో వేధించిన వీడికి మంచి పేరు ఎలా తీసుకురావాలనే  ఆ వ్యక్తి కొడుకు ఆలోచన చేశాడు . తండ్రి చనిపోయిన తర్వాత ఆ కొడుకు వాచిపోయేవాళ్లను తన్నటం మొదలు పెట్టాడు... అప్పుడు   గ్రామ ప్రజలందరు  వీడి  కంటే వీడి  బాబే నయంరా అనుకున్నారు.   వాడు తిట్లతో సరిపెట్టేవాడు... వీడు కొడుతున్నాడు అనుకునేవారు. ఈ కథలో  తండ్రి చంద్రబాబు టీడీపీ అయితే... తన్నిన  ఆ కొడుకు వైసిపి జగన్  అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెగా బ్రదర్  నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: