నిన్నటి నుండి  ఇజ్రాయెలీ స్పై వేర్ ‘ పెగాసస్ ‘వాట్సాప్ హ్యాకింగ్  చేసిన వార్త భారత్ లోని వాట్సాప్ యూజర్లను కుదిపేస్తోంది. వాట్సాప్ హ్యాకింగ్ గురైన 41 మందిలో మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, లోక్ సభ మాజీ ఎంపీ సంతోష్ భారతీయ వంటివారున్నారని ఓ ఆంగ్ల పత్రిక నిన్ననే పేర్కొంది. తాజాగా.. ఇప్పటివరకు 17 మంది ఈ టార్గెట్ కు గురయ్యారటవీరిలో లాయర్లు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ కూడా ఉన్నారు.


ఈ నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ కి గురయిందనే వార్త బయటకొచ్చింది. ఇజ్రాయెలీ స్పై వేర్ ‘ పెగాసస్ ‘ ని వినియోగించి ఆమె ఫోన్ ని హ్యాక్ చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా ఆరోపించారు. మీ ఫోన్ హ్యాక్ అయిందంటూ   వాట్సాప్ నుంచి మెసేజ్ అందిందని ఆయన చెప్పారు. ఈ స్నూపింగ్ సాఫ్ట్ వేర్ ని ఇతర యూజర్లు గుర్తించిన సమయంలోనే ప్రియాంక ఫోన్ కూడా హ్యాక్ అయిందన్నారు.

ఈ రకమైన చర్యలతో బీజేపీ.. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందంటూ దుయ్యబట్టారాయన. ఇంకా అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, జర్నలిస్టులపై కూడా ‘ గూఢచర్యం ‘ కొనసాగుతోందన్నారు. కాగా… దీనిపై స్పందించిన ప్రియాంక గాంధీ.. పలువురు ప్రముఖులపై నిఘా పెట్టేందుకు బీజేపీ గానీ, ప్రభుత్వం గానీ ఇజ్రాయెలీ సంస్థలను వినియోగించుకోవడం పెద్ద కుంభకోణమే అవుతుందని మండిపడ్డారు. దేశ భద్రతపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పైగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అని పేర్కొన్నారు.

సెల్ ఫోన్ల ఇల్లీగల్ హ్యాకింగ్ పై సుప్రీంకోర్టు దర్యాప్తు లేదా విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం..వాట్సాప్ సంస్థను అసలు ఇలా ఎందుకు జరిగిందో వివరించాలని కోరింది.కోట్లాది భారతీయుల ప్రయివసీని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.భారత పౌరుల వ్యక్తిగత జీవితాలను ‘ కాపాడేందుకు ‘ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: