ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఎక్కువ అయిపోయిన నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లో గత ఐదు నెలల నుంచి తీవ్రంగా ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే . దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక వారి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని...దీంతో  ఆవేదన చెందిన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత  సమస్య తీర్చాలని భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ విశాఖ సెంట్రల్ పార్క్ లో లాంగ్ మార్చ్  నిర్వహించారు. పవన్ లాంగ్ మార్చ్ కి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. విపక్ష పార్టీలు అయిన టీడీపీ బీజేపీ లు  లాంగ్ మార్చ్ కు మద్దతు తెలిపాయి . అయితే లాంగ్ మార్చ్ పూర్తిచేసుకుని  ప్రస్తుతం సభ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై పలు విమర్శలు గుప్పించారు. 

 

 

 

 వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైనది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్లే  ఇసుక సరఫరా నిలిచిపోయి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని... ఇసుక కొరతతో  రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయిందంటూ  పవన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిర్మాణాలు ఆగిపోతే ఎంత అభివృద్ధి ఆగిపోతుందో  వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడేమి ఎలక్షన్లు లేవని రోడ్ల మీదకు రావడం తో తనకి ఏం  సరదాగా కాదని తెలిపారు. ఆరు నెలల పాలన పై జగన్ ప్రభుత్వం  విమర్శించిన పవన్ ... భవన నిర్మాణ రంగ కార్మిక బాధలు చూడలేక లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా 26 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోవడం బాధాకరమని పవన్ తెలిపారు. తనకు ఒక కార్మికుడి  కష్టం ఆవేదన తెలుస్తునని ... భవన నిర్మాణ రంగ కార్మికుల బాధలు తన గుండెను తాకాయని   పవన్ తెలిపారు. భవన  నిర్మాణరంగ కార్మికులు లేకపోతే రాష్ట్రంలో ఈ బిల్డింగులు ఎక్కడివి... అభివృద్ధి ఎక్కడిది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

 

 

 

 అంతేకాకుండా రాజకీయాల్లో తనను  చంద్రబాబు దత్తపుత్రుడు... టిడిపి బి టీమ్  అని వైసీపీ నేతలు అంటున్నారని. నేను టిడిపి పాలసీలను విభేదించి బయటకు వచ్చానని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు . అయితే తాను టీడీపీ అధినేత చంద్రబాబుకు దత్తపుత్రుడిని కాదని ప్రజలకు దత్తపుత్రుడిని అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకి ఎవరి మీద ద్వేశం లేదని... కానీ జగన్ ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేనప్పుడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో వర్షాలు వరదలు వచ్చినందువల్లే ఇసుక తీయలేక పోతున్నాను అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారని... అయితే రాష్ట్రంలో మునుపెన్నడూ వర్షాలు రాలేదా.?  అప్పుడు ఇసుక కొరత ఎందుకు ఇసుక కొరత  ఏర్పడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా మిగతా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి  కదా మరి అక్కడ ఇసుక కొరత ఎందుకు ఏర్పడలేదంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి లాంగ్ మార్చ్ లో ప్రజలు  ఇంత ఘన స్వాగతం పలకడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని  పవన్ కళ్యాణ్ తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి: