విశాఖ లాంగ్ మార్చ్ సక్సెస్ అయ్యింది.  పాత జైలుకు ఎదురుగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని, చిన్న చిన్న నిర్మాణాలకు సైతం ఇసుక దొరకడం లేదని, ఒక కట్టడం కట్టాలి అంటే ఇసుక తప్పనిసరి అని, ఇసుక లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  


గా ప్రభుత్వం ఇసుకపై తప్పులు చేస్తే దానిని బయటకు తీసి వారిపై చర్యలు తీసుకోవాలని, అసలు ఇసుక దొరక్కుండా ఆపేస్తే దానివలన ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో అర్ధం చేసుకోవాలని అన్నారు.  ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని నమ్మి 151 స్థానాల్లో గెలిపించింది.  బహుశా భవిష్యత్తులో ఏ పార్టీకి అన్ని సీట్లు ఇచ్చి గెలిపిస్తారని అనుకోవడం లేదని పవన్ అన్నారు.  ప్రభుత్వం సరిగా పరిచేస్తే జనసేన పార్టీని పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదని, నాయకులు తప్పులు చేస్తుండటం వలనే తనలాంటి వ్యక్తులు పార్టీ పెట్టాల్సి వస్తోందని అన్నారు.  


తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేవాడిని కాదని, ప్రాణంపై తనకు తీపిలేదని అన్నారు.  ప్రజల కోసమే తాను పని చేస్తానని చెప్పారు.  పార్టీని నడపాలంటే కోట్లు అవసరం లేదు.. భావజాలం చాలు.  టీడీపీ దత్తపుత్రుడు అని ప్రచారం చేస్తున్నారు.  అది కరెక్ట్ కాదని, నేను ప్రజలకు దత్తపుత్రుడిని అని పవన్ పేర్కొన్నారు.  తెలంగాణ నడిబొడ్డున ఉద్యమం గురించి మాట్లాడాను.  ఆ దమ్ము చూపించా కాబట్టే ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మారు.  అధికారం, డబ్బు కోసం వెంపర్లాడే వానిని కాదని పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పారు.  


భీమవరం, గాజువాకలో ఓడిపోయినంత మాత్రాన మేం విఫలమైనట్లు కాదు.. నాకు ఇస్తున్న ఆదరణ కంటే పదవులు ముఖ్యం కాదు.. ఇసుక సమస్యపై ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు.  వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వచ్చాయా అని పవన్ ప్రశ్నించారు.  కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు ఎక్కువగా వచ్చాయని, కానీ అక్కడ ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు ఆగిపోలేదని, ఒక్క కార్మికుడు కూడా ఈ కారణంగా ఆత్మహత్య చేసుకోలేదని, అక్కడ వరదలు వచ్చినా ఇసుక కొరత లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు కొరత వచ్చిందని పవన్ ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: