ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎంత వేడి వేడిగా ఉన్నాయో అందరికి తెలిసిందే. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవ్వలేదు ఘోరాతి ఘోరంగా కొత్త ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చిన్న చిన్న వాటిని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

              

కాగా ఈ నేపథ్యంలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత పుత్రుడు నారా లోకేష్ గుంటూరులో ఇసుక కొరతపై దీక్ష చేస్తే వైజాగ్ లో దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అని దీక్ష చేశాడు. అయితే ఈరోజే భావన కార్మికులకు నిరసనగా వైజాగ్ లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లాంగ్ మార్చ్ చేశాడు. 

             

అయితే ఈ లాంగ్ మార్చ్ పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పవన్‌ కల్యాణ్‌ చేసేది లాంగ్‌ మార్చ్‌ కాదని.. అది రాంగ్‌ మార్చ్‌ అని విమర్శించగా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడ్డాడు అని.. ఇప్పుడు పవన్ పూర్తిగా చంద్రబాబు చేతిలో ఉన్నాడని ఆరోపించారు. 


కాగా ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌లు కలిసి తెరవెనుక రాజకీయాలు చేశారని.. ఇప్పడు బహిరంగంగా కలిసి రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు తనయుడు లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని.. పవన్‌కు కేడర్‌ లేదని అందుకే చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా తిరుగుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పవన్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చెయ్యండి మీ లోకేష్ ఎలాగో రాజకీయాలకు పనికిరాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: