అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలలకు జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేయటానికి ప్రతిపక్షాలకు ఒక్క అవకాశం దొరికింది. ప్రతిపక్షాలను కలపటానికి ఇసుక కొరత అనే అంశం దొరకిందంటే మిగిలిన అంశాల్లో జగన్ పరిపాలన బాగున్నట్లే లెక్క. నిజానికి ఇసుక అంశంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ కాలేదనే చెప్పాలి. కాకపోతే అవసరమైన వాళ్ళకు అవసరమైనంతగా ఇసుక దొరకటం లేదన్నది మాత్రం వాస్తవం.

 

అసలు వినియోగదారులకు అవసరమైనంత ఇసుక సరఫరా చేయలేకపోవటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే విడవకుండా కురుస్తున్న భారీ వర్షాలే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. టిడిపి హయాంలో జరిగిన ఇసుక దోపిడిని అరికట్టటానికి, వినియోగదారులకు పారదర్శకంగా ఇసుకను అందించాలన్న లక్ష్యంతో  జగన్ ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

 

నూతన విధానం అమల్లోకి రాకమునుపే కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు మొదలయ్యాయి. ఎప్పుడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో నదులు, వాగులు, వంకలు, చెరువుల్లోని ఇసుక తవ్వకాలు సాధ్యం కాలేదు. దాంతో ఇసుక కొరత వచ్చేసింది. దాన్నే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా అవకాశంగా మార్చుకుని ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోతున్నాయి.

 

చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు, వరదలు లేవు కాబట్టి ఇసుక దోపిడి యధేచ్చగా జరిగింది. చాలామంది టిడిపి నేతలు ఇసుక దోపిడిని ఆదాయార్జన మార్గంగా చేసుకుని భారీ ఎత్తున దోచేసుకున్నారనే ఆరోపణలున్నాయి. టిడిపి ఓటమికి ఇసుక దోపిడి కూడా ఓ కారణమే.

 

జగన్ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్ లను గుర్తించి. నోటిఫై చేసింది. రీచ్ ల నుండి అమ్మకాలు కూడా మొదలయ్యాయి. కానీ గతంలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలే ఇసుక తవ్వకాలకు అడ్డంకిగా మారిన విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. కానీ రాజకీయం చేయాలి కాబట్టి ఇసుక కొరతను అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: