పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిన ఏడు నెలల తరువాత బహిరంగ సభ పెట్టారు. అ బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించేలా ఉన్నాయి. పవన్ రాజకీయ జీవితం గట్టిగా అయిదేళ్ళు. అంతకు ముందు అన్న చాటు తమ్ముడిగా పవన్ యువరాజ్యం అధినేత హోదాలో వెలిగారు. ఇపుడు పవన్ సొంతంగా నేర్చుకున్న రాజకీయం ఏంటన్నది చూస్తే నిజంగా వింతగానూ విచిత్రంగానూ అనిపించక మానదు.


జగన్ సర్కార్ ఏర్పడిగట్టిగా ఆరు నెలలు కూడా కాలేదు. మరి పవన్ ఆందోళన చేశారు. సంతోషం. పవన్ కి ఇపుడు ప్రతిపక్ష  హోదా గుర్తుకువచ్చింది. ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ అయిదేళ్ల పాటు బాబుని ఏమీ ప్రశ్నించలేకపోయారు. ఇపుడు అయిదు నెలలకే ప్రశ్నించడం  శుభంగానే చూడాలి. కానీ పవన్ ప్రశ్నించడంతో ఎంత నిజాయితీ ఉంది. ఎంతటి చిత్తశుద్ధి ఉంది అన్నదే ఇక్కడ చర్చించాల్సిన అంశం.


అయిదు నెలల క్రితం ఏర్పడిన జగన్ సర్కార్ ని కూలిపోవాలి అంటున్నారు పవన్. ఓ వైపు తనకు అధికారం మీద ఎటువంటి మోజు వ్యామోహం లేదని చెబుతూనే పిల్లి శాపాలు పెడుతున్నారు. జగన్ ఒక్క మంచి పని చేస్తే చాలు తాను రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాలు చేసుకుంటానని అంటున్నారు. పోనీ జగన్ ఇసుక విషయంలో కొంత తడబడ్డారే అనుకుందాం, ఈ అయిదు నెలల్లో కనీసం ఒక్కటంటే ఒక్క అభివ్రుధ్ధి పని కూడా చేయలేదా.


పవన్ తట్టి లేపిన ఉద్ధానం సమస్య విషయలో జగన్ సర్కార్ తీసుకున్న చర్యలైనా కంటికి కనిపించలేదా. కిడ్నీ రోగులకు పదివేల రూపాయల పించను ఇస్తున్న సంగతి తెలియదనుకోవాలా. ఇక పలాసాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు జగన్ సర్కార్ తీసుకున్న చర్యలు కనిపించలేదా. రైతులకు భరోసా ఇస్తున్న సంగతి గుర్తు రాలేదా. అమ్మ ఒడి పధకం కానీ ఆటో డ్రైవర్లకు పదివేల ఆర్ధిక సాయం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేపట్టారు కదా జగన్. మరి అవన్నీ కనిపించలేదా.


ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపుగా వేయి కోట్లు ఆదా చేసిన సంగతిని పవన్ చెప్పలేకపోతున్నారా ఒప్పుకోలేకపోతున్నారా. ఇవన్నీ పక్కన పెడితే భవన నిర్మాణ కార్మికలు పేరిట సభ పెట్టి వైసీపీ నేతలను తిట్టడానికి పవన్ ఉపయోగించుకున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయంటే పవన్ రాజకీయంగా మళ్లీ తప్పటడుగే వేశారనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: