ఆర్టీసీ కార్మికుల ఆర్తనాదాలు మొదలయ్యి నేటికి దాదాపు 30 రోజులు కావస్తున్నా దీనిపై ఇంకా ఒక పరిష్కారం తేలకపోవడం నిజంగా విషాదకరం. ఇంత జరిగినా... ఇన్ని కష్టాలు పడ్డా కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె విరమించుకుని హామీలు నెరవేర్చుకొని ఉద్యోగాల్లోకి చేరలేదు అలాగే ప్రభుత్వం కూడా వారి కష్టాలు చూసి ఏమాత్రం చలించలేదు సరి కదా అసలు వారు చేసే సమ్మెను ఒక దిక్కుమాలిన సమ్మె అంటూ ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.

హైకోర్టు ఈ విషయంపై మందలింపు చర్యగా కేసిఆర్ కు సూచనలు ఇచ్చినప్పటికీ న్యాయపరమైన విషయాల్లో కార్పొరేషన్ స్వతంత్ర సంస్థ కనుక ప్రభుత్వం కూడా తాను అనుకున్న రీతిలోనే చర్చలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్టీసీని ప్రభుత్వంలో లో విలీనం చేయడం ససేమిరా కుదరదని కావాలంటే వారే సమ్మె వదిలి దిగివచ్చి ఉద్యోగాల్లో చేరాలని కెసిఆర్ కరాఖండిగా తేల్చి చెప్పేశారు.

ఇన్ని రోజులు కేసిఆర్ వారి డిమాండ్లను పట్టించుకోకపోవడమే కాకుండా ఉన్న 49 వేల ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించడం, కార్మికులు చేసే సమ్మెను వారి ఆత్మహత్యలను అసలు సీరియస్ గా తీసుకోకుండా బేఖాతరు చేశారు. చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంది అంటూ ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప ఒక కొలిక్కి రావట్లేదు.

ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ మళ్లీ వారికి ఇంకో అవకాశాన్ని ఇస్తున్నానని ఈ నెల ఐదో తారీకు లోపు వారి వారి విధుల్లో జాయిన్ కావాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ వారు అలా చేయకపోతే ఇక ప్రభుత్వం చేయాల్సింది చేసుకొనిపోతుందని హెచ్చరించారు. ఈ విషయం తెలిసిన కార్మికులు ఖంగు తిని తాము ఇన్నిరోజులు తిండి తిప్పలు మానుకొని , ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, రోడ్డెక్కి పోలీసులతో లాఠీలతో కొట్టించుకున్నా ఫలితం లేకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి ఎదురయింది. ఇక కార్మికులంతా చేసేదిలేక కోర్టు మెట్లు ఎక్కాలని భావిస్తున్నారు.

దీంతో నవ తెలంగాణ అడ్వకేట్స్ ఫోరం వారికి అండగా నిలుస్తామని భరోసానిచ్చి , కార్మికులంతా న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తే వారి తరపున ఉచితంగా వాదించి తమ సహాయం అందిస్తామని నవతెలంగాణ అడ్వకేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుధా నాగేందర్ తెలిపారు. దీంతో కొత్త బలం కొత్త ఉత్సాహం తోడైనందువల్ల రానున్న రోజుల్లో సమ్మె యొక్క రూపురఖాలే మరిపోయేలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: