ప్రజల హోదా ఎందుకు రాలేదు, అంటే ప్రజలలో చైతన్యం లేకపోవడం వల్లట. ప్రజలు పట్టించుకోకపోవడం వల్లనే హోదా రాకుండా పోయింది. చాలా సులువుగా అయిదు కోట్ల మంది మీద తప్పు తోసేశారు కొత్త రాజకీయాలు చేస్తానని వచ్చిన పవన్, నిజంగా ఈ మాట ఫార్టీ యియర్స్ చంద్రబాబు కానీ  మరెవరూ కానీ అనలేదు. పవన్ మాత్రం జనానిదే తప్పు అంటున్నారు. మరి జనం ఇక ఎపుడూ హోదా అనకూడదు, ఎందుకంటే తప్పు వారే చేశారు కనుక.


విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ ఎన్నో  విచిత్రమైన విమర్శలు చేశారు. అందులో  జనం కూడా బలి అయిపోయారు. ఆయనకు రాజకీయాలు తెలివవు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే అన్నట్లుగా పవన్ స్పీచ్ సాగింది. ప్రత్యేక హోదా విషయంలో పారాడాలని తనకూ ఉందని, అసలు హోదా విషయమే తాను మొదట ఎత్తిన వాడినని పవన్ చెప్పుకున్నారు. అందుకోసం బంగారం లాంటి మోడీ గారితో గొడవ కూడా పెట్టుకున్నానని చెప్పుకున్నారు. కానీ జనం సహకరించకపోతే నేనేం చేస్తాను అంటూ పవన్ తప్పు జనం మీద తోసేశారు. నిజమే అనుకుందాం కాసేపు. ప్రత్యేక తెలంగాణా తేవాలని తెలంగాణా జనం కోరారా. వారంతట  వారు వచ్చి పట్టుపట్టారా. రోడ్లు ఎక్కారా. కేసీయార్ కి కూడా మొదట్లో జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు కదా. కానీ పట్టువీడని విక్రమార్కుడిగా ఆయన ప్రయత్నం చేస్తూ పోయారు. చివరికి పద్నాలుగేళ్ళ తరువాత సాధించారు.


మరి అటువంటి పట్టుదల మన ఏపీ నాయకుల్లో ఉందా అన్నది కదా జనం నుంచి వస్తున్న ప్రశ్న. నిజమే  ప్యాకేజ్ వద్దు అంటూ పవన్ మొదట్లో  గట్టిగానే గర్జించారు. కానీ దాన్ని ఆయన కడవరకూ కొనసాగించలేకపోయారే. తాను ఆందోళన‌ చేస్తాను, అమరణ దీక్ష చేస్తాను అంటూ అప్పట్లో భారీ  స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇక ఏపీ ఎంపీలను రాజీనామా చేయమన్నారు. మోడీ సర్కార్ మీద అవిశ్వాసం పెట్టమన్నారు. విశాఖలో  జల్లికట్టు మాదిరి ఆందోళనకు తాను సై అన్నారు. ఆ తరువాత సీన్లోకి పవన్ వచ్చారా. ఇవన్నీ జనం అడిగితే పవన్ కి గుస్సా వస్తుందంటారు అంతా. మరి పవన్ తాను ఒక్కడే ఇప్పటికైనా ముందుండి ఎందుకు హోదా విషయంలో పోరాడరాదు. ఇక్కడే ఉంది రాజకీయం. కేంద్రంలోని మోడీ గట్టివారు హోదా ఇవ్వరు, ఆ సంగతి అందరికీ తెలుసు. పవన్ కి కూడా  తెలుసు ఆ విషయం చెప్పరు. జనం మీదనే తప్పు తోస్తారు. అందుకే  ఇది పవన్ మార్క్ రాజకీయం అంటున్నారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: