భవన కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా నేడు పవన్ కళ్యాణ్ వైజాగ్ లో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాంగ్ మార్చ్ కి ఆంధ్రలోని పార్టీలు అన్నింటిని మద్దతు ఇవ్వమని కోరగా ఒక్క తెలుగు దేశం పార్టీ మాత్రమే ఈ లాంగ్ మార్చ్ కు మద్దతు ఇచ్చింది. దీంతో ఎన్నో విమర్శల మధ్య మొదలైనా ఈ లాంగ్ మార్చ్ బహిరంగా సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.     

                          

దత్తపుత్రుడంటూ ప్రసంగం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారు అంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వం విఫలం కావడమే అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్య చేశారు. ఓ భావజాలాన్ని పట్టుకొని చనిపోయే వరకు మీరు నిలబడగలరా.. నన్ను విమర్శిస్తున్నారు అంటూ పవన్ నిలదీశారు. 

                                     

ఇప్పటి వరుకు 10 మంది భవన నిర్మాణ కార్మికులే చనిపోయారని అనుకున్నాను కానీ 36 మంది చనిపోయారని తెలిసి తట్టుకోలేకపోయాను... ఇసిక కొరత వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. జగన్ ఆంధ్రని అభివృద్ధి వైపు అడుగులు వేస్తే నేను వెళ్లి సినిమాలు నా సినిమాలు చేసుకుంటూ ఉంటా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 


దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. మేము నిన్ను ఏదో చెయ్యాలనుకుంటే నువ్వేది బాబు సినిమాలు అంటావ్ అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: