సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేస్తున్నారు. ఆ లోపల అయన చాల ముఖ్యమైన తీర్పులు  చెప్పబోతున్నారు. దాని వల్ల మన సాధారణ జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి .అయోధ్యలోని వివాదాస్పద భూభాగానికి సంబంధించిన కేసులో వచ్చే రెండు వారాల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశముంది. ఇది భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన సందర్భం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 4 నుంచి 15వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఈ అంశంపై తీర్పును వెల్లడించొచ్చు.
 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంపై డిసెంబర్ 14, 2018న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని వచ్చిన పిటిషన్లపై సీజేఐ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మే 10, 2019న తన తీర్పును రిజర్వ్ చేసింది.మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వంటివారు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.


అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఫిబ్రవరి 6న తన తీర్పును రిజర్వు చేసిందిదీనిపై కూడా తుది తీర్పు రావచ్చు.

భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా, రాదా అనే అంశంపై సీజేఐ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చే అవకాశం ఉంది.సీజేఐ కార్యాలయం 'పబ్లిక్ అథారిటీ' అంటూ జనవరి 2010 నాటి దిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ చేసిన విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: