ఈ ప్రపంచంలో అవసరాలు మనిషి చుట్తూ తిరుగుతుంటే, మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. తనకున్న అవసరాలు తీర్చుకోవడానికి అడ్డమైన దార్లు తొక్కుతున్నాడు. ఎక్కడైన ఒక రూపాయి లాభం వస్తుందంటే వదులుకునే పరిస్దితులు లేవు. కొందరికైతే అవసరానికి కంటే చాలా డబ్బులున్నా అవి సరిపోక ఇంకా కోట్లు కోట్లు కూడపెడుతుంటారు. ఇలాంటి వారికి ఎంతున్న తృప్తి ఉండదు.


ఇదంతా ఒకెత్తైతే రోడ్డుపై వెళ్లుతుంటే ఒక రూపాయి బిళ్ల దొరికిన నిస్సంకోచంగా తీసుకుని జేబులో వేసుకుంటాం. అదే వందలు వేయి రూపాయలు అంతకంటే ఎక్కువైతే కనిపించిన వాడి ఆనందానికి హద్దే ఉండదు. పాపం అన్ని డబ్బులు ఎవరు పోగొట్టుకున్నారో, డబ్బులు జార విడుచుకున్న వారు ఎలాంటి పరిస్దితులో ఉన్నారో తెలుసుకోని ఇద్దాం అనే ఆలోచనే రాదు. ఎవరైన ఇలాంటి సలహా ఇస్తే వారిని శత్రువుల్లా భావిస్తారు.


కాని ఒక తాత తనకు దొరికిన డబ్బును నిజాయితీగా అప్పగించారు. ఇతన్ని చూస్తే సభ్యసమాజం సిగ్గుపడాలి. ఇంతకు ఈ నిజాయితీపరుడు ఎక్కడుంటాడంటే మహారాష్ట్రలోని సతారాలో ఉన్నారు. ఇతని పేరు ధనాజీ జగ్దలే. ఇతనికి  ఓ రోజు అదృష్టలక్ష్మి  కనికరించగా బస్టాప్‌లో రూ.40 వేలు దొరికాయి కాని ఆ డబ్బును సొంతదారుకే తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి రూ.వేయి బహుమతిగా ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించి, బస్సు చార్జీలకు కేవలం 7 రూపాయలు చాలన్నాడు.


ధనాజీ నిజాయితీ మెచ్చిన సతారా ఎమ్మెల్యే శివేంద్రరాజే భోసలే, మాజీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే, మరికొన్ని సంస్థలు అతనికి సన్మానం చేశాయి.  ఇక ఇతని నిజాయితీకి మెచ్చిన ఎన్నారై ఒకరు రూ.5 లక్షలు బహుమతిగా ఇవ్వడానికి ముందుకురాగా ఆ సొమ్మును కూడా తీసుకోలేదు. ఒకరి డబ్బు తో తనకు సంతృప్తి కలగదని, మనుషులు నిజాయితీతో బతకాలని ధనాజీ సందేశమిచ్చాడు.. నిజంగా ఇతన్ని చూసి సమాజంలో డబ్బుకోసం అడ్డమైన గడ్డితినే మనుషులు సిగ్గుపడాలంటున్నారు మరికొందరు నిజాయితీగా ఉండేవారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: