ఇండియా... పాక్ మధ్య ఆర్టికల్ 370 రద్దు తరువాత రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.  పాక్ కాల్పుల ఉల్లంఘనలు అతిక్రమించి ఇండియా పోస్టులపై కాల్పులు జరుపుతున్నారు.  ఈ కాల్పుల్లో జవానులతో పాటు అమాయక ప్రజలు కూడా మరణిస్తున్నారు.  మరోవైపు ఉగ్రవాదులు కాశ్మీర్లో కాల్పులు జరపడం వలన అమాయకులు ముఖ్యంగా కాశ్మీరేతరులు మరణిస్తున్నారు.  దీనికి ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబిస్తుంది.  ఇక అక్టోబర్ 31 వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయిన సంగతి తెలిసిందే.  


ఇక ఇదిలా ఉంటె, ఇండియాలోని గురుదాస్ పూర్ నుంచి పాక్ లో ఉన్న గురుద్వారా సాహెబ్ వరకు కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం పూర్తయింది.  గురుదాస్ పూర్ నుంచి పాక్ బోర్డర్ వరకు ఇండియా కారిడార్ ను పూర్తి చేస్తే... పాక్ బోర్డర్ నుంచి గురుద్వారా సాహెబ్ వరకు పాక్ కారిడార్ ను పూర్తి చేయాలి.  ఇండియా ఎప్పుడో ఈ పనులు పూర్తి చేసింది.  కాగా, పాక్ ఇటీవలే ఈ కారిడార్ ను నిర్మించింది.  ఈనెల 9 వ తేదీన ఈ కారిడార్ ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓపెన్ చేయబోతున్నారు.  


అయితే, ఈ కారిడార్ మీదుగా గురుద్వారా సాహెబ్ లోని గురునానక్ సమాధిని సందర్శించే వారి నుంచి 20 డాలర్ల ఫీజును వసూలు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది.  అయితే, దీనిపై విమర్శలు వచ్చాయి.  ఫీజు వసూలు చేయకూడదని ఇండియా కోరింది.  కానీ, పాక్ మాత్రం పట్టు వదలడం లేదు.  ఇండియా నుంచి కర్తార్ పూర్ కారిడార్ మీదుగా గురునానక్ గురుద్వారా సందర్సించాలి అనుకునే వారు ఫీజు కట్టాల్సిందే.  


అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఓ అఫర్ ను ప్రకటించింది.  ఓపెనింగ్ రోజున మాత్రమే ఈ ఫీజుకు మినహాయింపు ఇచ్చింది.  ఆరోజున ఫీజు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.  ఆరోజు మినహా మిగతా రోజుల్లో గురుద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కర్తార్ పూర్ కారిడార్ మీదుగా వెళ్లే వాళ్లకు వీసా, పాస్ పోర్ట్ అవసరం లేదు.  అధికారిక గుర్తింపు కార్డులు ఉంటె చాలు.  ఐదు రోజుల ముందుగా పేరు నమోదు చేసుకోవాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: