జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇసుక కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై నిరసనగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. పవన్ ఈ కార్యక్రమం చేపట్టడంతో లాంగ్ మార్చ్ అనే పదం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ లాంగ్ మార్చ్ చైనాలో 1934 లో జరిగింది. అప్పట్లో అధికారం కోసం చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో 10 వేల కిలోమీటర్లు నడిచింది. ఈ లాంగ్ మార్చ్ ఆ పార్టీకి అధికారం సాధించిపెట్టింది.


లాంగ్ మార్చ్ చైనా రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ పదాన్ని అపహాస్యం చేశారన్న విమర్శలు వస్తున్నాయి.. చైనా నాయకులు పది వేల కిలోమీటర్లు నడిస్తే పవన్ కల్యాణ్ కనీసం పది కిలోమీటర్లు కూడా నడవలేకపోయారు. ఇప్పుడు ఇదే విషయాన్ని వైసీపీ నేతలు తమ విమర్శల్లో ప్రస్తావిస్తున్నారు.


జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్‌ ‘లాంగ్‌ మార్చ్‌’తో ప్రజలు నవ్వుకుంటున్నారని ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ‘లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో 10 వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్‌ కల్యాణ్‌ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని అన్నారు.


అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. పవన్ కల్యాణ్ ఆ రెండున్నర కిలోమీటర్లు కూడా నడవలేకపోయారు. ఆయన వాహనంపై వస్తుంటే.. జనసైనికులు ఆయన్ను వెంబడించారు. ఇది ఎలా లాంగ్ మార్చ్ అవుతుందో అర్థం కాక జనం జుట్టుపీక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.


మరింత సమాచారం తెలుసుకోండి: