మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు పార్టీల అధినేతలకు ఒకేసారి షాక్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గంటా ఎక్కడా కనబడలేదని సమాచారం. పవన్, చంద్రబాబునాయుడు వివిధ అంశాల మీద మద్దతు ఇచ్చిపుచ్చుకుంటూ మళ్ళీ దగ్గరవుతున్న విషయం తెలిసిందే.

 

ఇందులో భాగంగానే లాంగ్ మార్చ్ కు మద్దతు కోరుతూ చంద్రబాబుతో మాట్లాడారు. మద్దతు ఇవ్వటానికి రెడీగా ఉన్న చంద్రబాబు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. అందుకనే తెలుగుదేశంపార్టీ తరపున మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారని పవన్ కు హామీ ఇచ్చారట.

 

పవన్ కు హామీ ఇచ్చినట్లుగానే ముగ్గురు మాజీ మంత్రులకు లాంగ్ మార్చ్ లో పాల్గొనాలంటూ ఆదేశాలిచ్చారు. అయితే  చింతకాయల, అచ్చెన్నలు మాత్రమే లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు. గంటా మాత్రం ఎక్కడా అడ్రస్ లేరట. గంటా డుమ్మా కొట్టిన విషయం తెలియగానే విషయం ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించిన టిడిపి ఎన్టీయార్ ట్రస్టు భవన్ నేతలకు కూడా గంటా అందుబాటులో లేకుండాపోయారట.

 

మొదటి నుండి గంటా వ్యవహారం అందరికీ అనుమానాస్సదంగానే ఉంది. ఎందుకంటే అధికారపార్టీలో తప్ప గంటా ప్రతిపక్షంలో బతకలేడు. ఆయన చరిత్ర తీసుకుంటే ఈ విషయం స్పష్టమైపోతుంది. ఏ పార్టీ తరపున గెలిచినా తర్వాత అధికారపార్టీలోకి జంప్ చేయటం గంటా స్పెషాలిటి.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచినా అధికారంలోకి వచ్చిన  వైసిపిలోకి జంప్ చేయటానికి చాలా ప్రయత్నాలే చేసుకుంటున్నారు. కాకపోతే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలన్న కండీషన్ ఇబ్బంది పెడుతోంది. అదే సమయంలో గంటా చేరికను వైసిపిలో చాలామంది నేతలు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. ఈ రెండు కారణాలతోనే గంటాలో అయోమయం మొదలైంది. సరే ఏపార్టీలో చేరుతారు అనే విషయంలో క్లారిటి లేకపోయినా ముందైతే ఇటు చంద్రబాబు అటు పవన్ కు గంటా ఒకేసారి షాక్ ఇచ్చిందైతే వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: