విశాఖ టీడీపీ  రాజకీయాల్లో చిత్రాలు ఎన్నో జరుగుతున్నాయి.  ఆ పార్టీకి పెట్టని కోటగా  ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు వ్యవహార శైలి ఎపుడూ రచ్చే, ఎపుడూ పెద్ద చర్చే. చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో మంత్రులుగా వీరిద్దరూ హైలెట్. ఇపుడు ఆరు నెలల పాటు విపక్షంలో కూడా వీరే అట్రాక్షన్. ఈ ఇద్దరూ సీనియర్ నాయకులు. ఈ ఇద్దరికీ మందీ మార్భలం, అర్ధ బలం, అంగబలం దండీగా ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ ఇద్దరు మాజీలు టీడీపీలో చేయాల్సింది చేస్తూనే ఉన్నారు.


చంద్రబాబు పవన్ కి మద్దతుగా లాంగ్ మార్చ్ కి ఇద్దరు ముగ్గురు మాజీ మంత్రులను ఎంపిక చేశారు.  అందులో విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే గంటా తప్ప మిగిలిన ఇద్దరూ హాజరయ్యారు. ఇక గంటా గైర్ హాజరు అందరూ ఊహించిందే  అయినా ఆయన ఇకపై ఏం చేయబోతారన్నదే ఇపుడు సస్పెన్స్ గా ఉంది.


నిజానికి గంటా టీడీపీ కార్యక్రమాల్లో ఇపుడు  పెద్దగా పాలు పంచుకోవంలేదు, ఆయన సొంత పార్టీ ఇసుక కార్యక్రమానికే రాలేదు, ఇపుడు పవన్ పార్టీ వేదికను ఎలా ఎక్కుతారని చాలా మంది డౌట్లు వ్యక్తం చేశారు. పైగా పవన్ గంటాను టార్గెట్ చేసుకుని పదే పదే కామెంట్స్ అప్పట్లో చేశారు. సో గంటా రారు అనుకున్నారు. ఆయన కూడా అలాగే రావడం మానేశారు. ఇకపోతే మీటింగుకు వచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారన్న విమర్శలు గట్టిగానే వచ్చాయి. విశాఖలో మెంటల్ ఆసుపత్రి ఉంది అంటూ మొదలెట్టిన అయ్యన్న అక్కడ ఒక పిచ్చోడికి ఏపీ సీఎం కుర్చీ అప్పగిస్తే జగన్ కంటే  బాగా పాలిస్తాడంటూ జగన్ని పిచ్చోడి కంటే ఘోరం చేసి పారేశారు. జగన్ బుద్ది తక్కువైందని కూడా హాట్ కామెంట్స్ చేశారు. 


మొత్తానికి అయ్యన్న జగన్ మీద దారుణమైన కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశం అయ్యాయి. అయితే వైసీపీ నేతలు వూరుకోలేదు ఆ పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్ నాధ్ అయ్యన్నను డ్రగ్ మాఫియా డాన్ తో పోల్చేసారు. మొత్తానికి పెద్ద మనిషిగా హాజరైన అయ్యన్న వివాదాస్పద కామెంట్స్ చేయడం ద్వారా టీడీపీ పరువు నిలబెట్టారా పడగొట్టారా అన్నదే తమ్ముళ్ల చర్చ.


మరింత సమాచారం తెలుసుకోండి: