ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే  మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు మెరుగైన విద్యాప్రమాణాలు అందించేందుకు  కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పనితీరును గురించి నివేదిక అందించాలనినిపుణుల కమిటీని ఆదేశించినట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసేందుకు వైసీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.



 ముఖ్యంగా నారాయణ చైతన్య విద్యా సంస్థలు సహా పలు విద్యాసంస్థల ఆర్థిక మూలాలపై జగన్ సర్కార్ వేటు వేసేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో మెరుగైన విద్య కోసం విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై జగన్ సర్కార్ ఇటీవలే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా  ఉన్నత విద్యలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని కాలేజీల పని తీరును అధ్యయనం చేసి ప్రభుత్వం నియమించిన కమిటీ సర్కార్ కు నివేదిక ఇచ్చింది . అయితే ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు వందలు డిగ్రీ కాలేజీలు 206 ఇంజనీరింగ్ కాలేజీలను  మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం ప్రైవేటు కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీలు ఎక్కువగా ఉత్తీర్ణత శాతం సాధిస్తుండడం వల్ల... రాష్ట్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల పై వేటు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 



 కాగా  రాష్ట్రంలో ఉన్నత విద్యలో ఉత్తీర్ణత శాతం లో ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే మంచి ఫలితాలు వస్తున్నాయని కమిటీ ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో రోజురోజుకి విద్యాప్రమాణాలు సన్నగిల్లుతున్నయని  ఈ నివేదికలో నిపుణుల కమిటీ వెల్లడించింది . ప్రైవేట్ కాలేజీలో రోజురోజుకు ప్రమాణాలు సన్నగిల్లుతుండగా  మౌలిక వసతుల కల్పనలో కూడా సక్రమంగా కాలేజీలు చేయడం లేదని ఈ నేపథ్యంలో 71 శాతం ప్రైవేటు డిగ్రీ కాలేజీలు.. అద్దె భవనాల్లో పనిచేస్తుండటం వల్ల.. విద్యార్థులకు మెరుగైన విద్య అందకపోవడంతో ఉత్తీర్ణత శాతం బాగా తక్కువగా ఉందని తెలిపింది. 40 శాతం ప్రైవేటు డిగ్రీ కాలేజీలో 25 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతుండగా... 58 శాతం ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 50 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన జగన్ సర్కార్.. రాష్ట్రంలో 1153 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా అందులో 500 కాలేజీలను మూసివేయాలని తీర్మానించినట్లు  తెలుస్తుంది. అలాగే మొత్తం 287 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అందులో 200 కాలేజీలను మూసేవేయాలని కమిటీ  సూచించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో ఎక్కువగా వ్యాపించి ఉన్న నారాయణ  చైతన్య విద్యా సంస్థల పైన వేటు పడనున్నట్లు  తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: