దేశ రాజధాని ఢిల్లీ రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతుంది. దీపావళి తర్వాత దేశ రాజధానిలో వాయు కాలుష్యం ఊహించని స్దాయిలో పెరగటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. నవంబర్ నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా ఢిల్లీ నిలిచింది. ఈ దశలో నవంబరు 5 వరకు అక్కడి స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు.


ఒక వైపు పొరుగున ఉన్న పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దగ్ధం చేయటం.. మరోవైపు దీపావళి బాణసంచాల పేలుళ్లు. ఇంకోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ ఇవన్ని కలిపి ఢిల్లీ కాలుష్యాన్ని ప్రమాద స్థాయికి చేర్చాయి. దీంతో ఢిల్లీ కాలుష్యానికి  కేరాఫ్ అడ్రస్ గా మారి, ఇక్కడి కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుకోగా, కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 


ఇప్పటికే ఈ మహనగరంలోని గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా.. ఏక్యూఐ రికార్డు స్థాయిలో 599కు చేరుకోవడంతో హెల్త్ ఎమర్జెన్సీని విధించాలని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ, పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా గతేడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిస్ధితిని అధిగమించటానికి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 50లక్షల మాస్క్‌లను పంపిణీ చేసిందన్న విషయం తెలిసిందే.


ఇకపోతే మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావద్దని సీఎం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. వాయు కాలుష్యం తగ్గించేందుకు సోమవారం నవంబర్ 4 నుంచి ఢిల్లీలో సరిబేసి విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలని తిరస్కరించిన వారిపై భారిగా జరిమాన విధించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇకపోతే  శీతాకాలంలో ఇక్కడి వాతావరణ కాలూష్యం మరింతగా ప్రమాదకరంగా మారుతుంది. ఇక ఇప్పటికే ఇక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: