కేంద్ర ప్రభుత్వం 37 ఆర్టికల్ ని రద్దు చేసిన తరువాత దేశం లో రాష్ట్రాలనుమరియు  కేంద్రపాలిత ప్రాంతాలను వాటి రాజధానులను గుర్తిస్తు ఒక భారతదేశ పాఠాన్ని విడుదల చేసింది అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత  అంతకు ముందే ఉన్న 13 జిల్లాలతో ఏర్పాటైన ఏపీకి రాజధాని ని గుర్తించక పోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే రాష్ట్రము విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ప్రకటించిన రాజధాని ప్రాంతం  విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరి ప్రాంతంలో  అమరావతి అని ప్రధాని మోదీ సమక్షం లో  నామకరణం చేసి  నిర్మించాలని ప్రభుత్వం 33 వేల ఎకరాలను సమకూర్చి కూడా రాజధాని కి ఇలాంటి ముందడుగు పడకపోవడం తో  కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ పటం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని గుర్తించలేక పోయంది.

ఇటీవల ప్రకటించిన మరియు విభజించిన  జమ్మూకాశ్మీర్,  లడఖ్  లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సరి కొత్త పొలిటికల్ మ్యాప్ లో ఈ రెండు రాష్ట్రాలను గుర్తించింది  అలాగే జమ్మూ కాశ్మీర్, లడక్ సహా దేశంలోని 29 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి రాజధానులతో సహా గుర్తించింది.


అలాగే  అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానులను ఈ మ్యాప్ లో గుర్తించినప్పటికి ఏపీ మ్యాప్ లో రాజధాని పేరును గానీ, ప్రాంతాన్ని గానీ గుర్తించలేదు అలాగే పిన్ కోడ్ కూడా లేకుండాపోయింది.
 ఏపీ మ్యాప్ లో రాజధానిని గుర్తించకదా పోవడం గమనార్హం అందువల్ల ఏపీ మ్యాప్ లో రాష్ట్రం పేరును మాత్రమే ప్రచురించింది. పాత  13 జిల్లాలతో ఏపీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మంగళగిరిలో ఏర్పాటు అవుతుంది అని ప్రకటించిన తరువాత ఇటీవల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వైస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం తో మళ్ళీ రాజధాని విషయం లో కొంత గందరగోళం నెలకోన్నది.

అలాగే జగన్ మాట్లాడుతూ రాజధాని విషయం లో గత ప్రభుత్వం చాలా అలసటను చూపింది అని రాజధాని నిర్మాణం పైన ఇలాంటి స్పష్టతను ఇవ్వలేదని విమర్శించాడు అలాగే వారి మంత్రివర్గం కూడా విభిన్నమైన ప్రకటనలను చేయడం తో రాజధాని ని మారుస్తారని సందేహం ఏర్పడింది మరి అమరావతి నే కొనసాగించి నిర్మాణాలను చేపడతారా లేదా మారుస్తారా అన్నా అంశం కొలిక్కి రాలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పొలిటికల్ మ్యాప్ లో ఏపీ కి  రాజధాని ని గుర్తించక పోవడం తో రాజధానిని మారుస్తున్నారన్న సందేహం రాక మానదు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: