తెలంగాణాలో సీనియర్ నేతగా గుర్తింపున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మళ్ళీ యాక్టవ్ అవబోతున్నట్లు సమాచారం. కొంత కాలంగా రాజకీయ పట్టుకోసం ప్రయత్నిస్తున్న మోత్కుపల్లి తొందరలోనే బిజెపిలో చేరబోతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి మోత్కుపల్లి ఇంటికి వెళ్ళి దాదాపు రెండుగంటల పాటు చర్చలు జరిపారు. తమ పార్టీలో చేరాలని వారి ఆహ్వానానికి మాజీ మంత్రి కూడా సానుకూలంగా స్పందించారట లేండి.

 

సానుకూలంగా స్పందించక మోత్కుపల్లి కూడా చేసేదేమీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈయనను చేర్చుకోవటానికి ఏ పార్టీ కూడా అంత ఇంట్రస్ట్ చూపటం లేదు. టిడిపిలో ఉన్నంత కాలం మోత్కుపల్లి బాగానే ఉండేవారు. అయితే టిడిపిలో ఉంటూనే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలంటూ చంద్రబాబునాయుడుకు పదే పదే చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల మాజీ మంత్రి చెప్పిన మాటను చంద్రబాబు పట్టించుకోలేదు.

 

దాంతో రేవంత్ రెడ్డి లాంటి నేతలతో గొడవలు పెట్టుకుని పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. తాను టిడిపిలో నుండి బయటకు వచ్చేయగానే తనను చేర్చుకోవటానికి అన్ని పార్టీలో రెడ్ కార్పెట్ పరిచి పోటి పడతాయని అనుకున్నారు. కానీ విచిత్రంగా ఏ పార్టీకూడా ఈయన్ను అసలు పట్టించుకోనే లేదు.

 

టిడిపిలో ఉన్నంత కాలం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పోరాటం చేశాడో చివరకు ఆ టిఆర్ఎస్ కూడా పట్టించుకోకపోవటమే ఆశ్యర్యం. దాంతో ఇటు చంద్రబాబును అటు కెసియార్ ను తిట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. కొంతకాల జగన్ కు మద్దతుగా మాట్లాడినా తర్వాత ఈయన్ను వైసిపి నేతలు కూడా పట్టించుకోలేదు.

 

తర్వాత ఓసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటి అయినా ఏమైందో తెలీదు. చివరకు ఇపుడు బిజెపిలో చేరటానికి రంగం సిద్ధమైంది. ఎందుకంటే బిజెపికి నేతలు లేరు. మోత్కుపల్లికి పార్టీలేదు. కాబట్టి బిజెపి నేతలు, మాజీ మంత్రి మధ్య చర్చలు ఫలపప్రదమైందని సమాచారం. అందుకనే వచ్చే శనివారం కమలం కండువా కప్పుకోబోతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: