ఢిల్లీలో వాతావరణం ఎలా మారిపోయిందో చెప్పక్కర్లేదు.  ఢిల్లీలో బ్రతకాలంటే.. చావు గురించి పట్టించుకోకూడదు.  అక్టోబర్ 27 వ తేదీ తరువాత ఢిల్లీ వాతావరణంలో పూర్తగా మార్పులు వచ్చాయి.  ఉన్నట్టుండి పొగ కమ్మేస్తుంది.  పట్టపగలే చీకట్లు పడిపోతుంది.  ఎదురుగా ఎవరున్నారు.. ఎవరు లేరు అనే సంగతులు తెలియవు.  ఈ పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఇక, యమునా హైవై పై చెప్పాల్సిన అవసరం లేదు. 


పొగమంచు కారణంగా యాక్సిడెంట్ కావడం వంటివి జరుగుతున్నాయి.  ఈ యాక్సిడెంట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.  దీపావళి రోజున టపాసులు కాల్చడంతో ఆ కాలుష్యం ఢిల్లీని వదిలి వెళ్ళలేదు.  పైగా వర్షం కూరడంతో.. ఆ దుమ్ము ధూళి నగరంపై అలానే ఉండిపోయింది.  ఇది ప్రమాదకరంగా మారింది.  రోజు రోడ్డుపైకి లక్షలాది వాహనాలు వస్తున్నాయి.  ఈ వాహనాల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  


ఇబ్బందులు వచ్చినా .. ప్రజలు ఢిల్లీని వదిలి వెళ్లేందుకు ఇష్టపడరు.  ఎందుకంటే ఢిల్లీలో ఉపాధి అవకాశాలు అధికం.  అదే విధంగా పొల్యూషన్ కూడా అధికం అని చెప్పాలి.  ఈ పొల్యూషన్ ను తట్టుకొని నిలబడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.  ఎండాకాలంలో ఎండలు, వానాకాలంలో వర్షాలు, చలికాలంలో చలి అధికంగా ఉంటుంది ఢిల్లీలో.  పొల్యూషన్ కు ఒక కాలం అంటూ లేకపోవడంతో ప్రజలు అన్ని కాలాల్లో దీనిబారిన పడుతున్నారు.  


దీని నుంచి రక్షణ పొందేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరిబెసి పధకాన్ని మరలా అమలు చేసేందుకు సిద్ధం అయ్యింది.  సరిబెసి పధకం ద్వారా కొంతవరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నది ఢిల్లీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం.  కాగా, పధకాన్నిప్రవేశపెట్టిన తరువాత గతంలో కొంత కంట్రోల్ లోకి వచ్చింది పొల్యూషన్.  ఇప్పుడు మరలా ఈ పధకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మరి ఈసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ లోకి వస్తుందా చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: