సినిమా వాళ్ళంటే తమకు ఎక్కడలేని గౌరవం ఉందని,కానీ రాజకీయాలూ సినిమా ఒక్కటి కాదన్న  సంగతి జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు.  విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ సందర్భంగా చేసిన కామెంట్స్ ఆయన ఖండించారు. పవన్ అన్న చాటు తమ్ముడిగా అభివర్ణించారు. పవన్ మాదిరిగా తాము అన్నను అడ్డుపెట్టుకుని ఎదగలేదని ఆయన సెటైర్లు వేశారు.


పవన్ మీద విశాఖలో ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పవన్ రాజకీయ పార్టీ పెట్టి ఇప్పటికే తగ్గిపోయారని, ఇపుడు తనకు తోచినట్లుగా మాటలు అంటూ మరింత దిగజారిపోవద్దని హితవు పలికారు. నాయకులు అన్న వారు జనం నుంచి రావాలి కానీ వేల పుస్తకాలు చదివినంత మాత్రాన తయారు కారని కూడా అవంతి చురకలు అంటించారు.


చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మగా మారారని అవంతి అంటూ ఇప్పటికే చాలా మంది అలా బాబు ట్రాప్ లో చిక్కి ఎలా ఇబ్బంది పడ్డారో పవన్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కాపుల్లో ఎంతో మంది స్వయం క్రుషితో ఎదిగారని అలాంటి వారిలో తాను కూడా ఒకడినని చెప్పిన అవంతి కాపుల్లో పవన్ ఒక్కరే ఎదగాలా మరెవరూ గొప్పవారు కాకూడదా అని సూటిగా ప్రశ్నించారు.  పవన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అవంతి అన్నారు.


గోదావరి క్రిష్ణకు వరదలు వచ్చిన సంగతి లోకమంతా తెలుసుకుందని, పవన్ మాత్రం ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నారని అవంతి అన్నారు. పవన్ తమ సర్కార్ కు  డెడ్ లైన్లు పెట్టడేమంటని అన్న మంతి ఇసుక అందుబాటులోకి వస్తే తామే పెద్ద ఎత్తున సరఫరా చేస్తామని పేర్కొన్నారు. మొత్తానికి మినిస్టర్ గారు పవర్ స్టార్ మీద బాగానే సెటైర్లు వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: