విపరీతకాలే వినాశ బుద్దే అంటారు..టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోతుందో అదే స్థాయిలో నేరాల సంఖ్య కూడా బాగానే పెరిగిపోతుంది.  ముఖ్యంగా మనిషిని మనిషి గా గుర్తించే పరిస్థితి పోతుంది..కేవలం డబ్బు, పలుకుబడి, లగ్జరీగా జీవించడం ఇదే మనిషి కావాలనుకుంటున్నారు.  అందుకోసం ఎదుటి వారితో సంబంధం లేదు..ఏమైనా పట్టింపు లేదు.  ఇదే క్రమంలో శృంగారం  అనేది గుట్టుగా ఉండాల్సింది రోడ్డుపైకి వచ్చేలా చేస్తున్నాయి ఫోర్న్ సైట్లు.  ఒకప్పుడు సీక్రెట్ గా సాగే ఈ వ్యహారం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ పుణ్యమా అని చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.

అమెరికా, బ్రిటన్‌ల తర్వాత ఈ వెబ్‌సైట్‌ను అత్యధికంగా చూస్తున్న మూడో పెద్ద దేశం భారత్. ఇక్కడ పోర్న్‌హబ్‌లో వీడియోలను ఎక్కువగా మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్(అశ్లీల) వెబ్‌సైట్ ‘పోర్న్‌హబ్’. భారత్‌లో తన మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతోందని ఆ సంస్థ చెబుతోంది. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ కొనాలంటే కేవలం సంపన్నులకు మాత్రమే వీలు ఉండేది..కానీ దాని ఖరీదు దారుణంగా పడిపోయే దిగువ మద్యతరగతి వారు కూడా కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు.    చౌకగా స్మార్ట్‌ఫోన్లు, డేటా అందుబాటులోకి రావడంతో భారత్‌లో అశ్లీల వీడియోలు చూడటం సులభమైంది.  చాలామంది భారతీయ యువకులకు అశ్లీల వీడియోలు చూడడంద్వారానే మొదటిసారి సెక్స్‌తో పరిచయం ఏర్పడుతోంది.

పోర్న్ వీడియోలు, పిల్లలతో నీలి చిత్రాలు, ప్రతీకార నీలిచిత్రాలు, అత్యాచార వీడియోలు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయి.   ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరగకముందు చిన్నచిన్న దుకాణాల్లో గుట్టుగా దొరికే రేప్ వీడియోలు, పోర్న్ వీడియోలను జనం చూసేవారు.  ఇలాంటి వాటిని చూడటం వల్ల మైనర్లు సైతం సెక్స్ కోరికలతో రెచ్చిపోతున్నారు.  ఇటీవల కొంత మంది పరిశోదకులు  దగ్గర్లోని పట్టణంలో  మాట్లాడిన కొంతమంది 15, 16 ఏళ్ళ అబ్బాయిలు ఫోర్న్ సినిమాలు చూస్తుంటే చిన్నా, పెద్ద వయసు తేడాల బలవంతంగా అయినా సరే  సెక్స్ చేయాలనే కోరిక కలుగుతుందిన బహాటంగానే చెప్పారు.

ఇంటర్ చదువుతున్న ఒకబ్బాయి తాను 25- 30 వీడియోలు చూశానని, ఇలాంటి క్లిప్పింగులు వచ్చినపుడు అందరూ షేర్ చేసుకుంటామని చెప్పాడు. అయితే ఏకాంతంగా పోర్న్ చూడడం భారత్‌లో చట్టబద్ధమే. కానీ, ఆ వీడియోలను రూపొందించడం, షేర్ చేయడం (ఇతరులకు పంపడం) చట్ట విరుద్ధం. ఏది ఏమైనా పెరుగుతున్న టెక్నాలజీ తో ప్రతి విషయం మన అరచేతిలో చూపెట్టే స్మార్ట్ ఫోన్లకు పిల్లలను ఎంత దూరం ఉంచితే అంత మంచిదని అంటున్నారు మానసిక నిపుణులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: