సినిమాలో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న  హీరో పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అకస్మాత్తుగా జనసేవ  చేయాలని భావించి జనంలోకి బయలుదేరారు. జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ప్రభావితం చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తారని అందరు అనుకున్నారు. కాని  2014 లో జరిగిన ఎన్నికల్లో పవన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు తెలిపారు. ఇక ఆ తర్వాత టీడీపీ తో విభేదాలు వస్తే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ టిడిపి కి దూరం అయినప్పటికీ కూడా... టిడిపితో పొత్తు అలాగే ఉందని  వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇసుక సమస్య పట్టిపీడిస్తోంది... భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 

 

 

 

 అయితే ఇసుక కొరత సమస్య పై స్పందించిన పవన్ కళ్యాణ్... రాష్ట్రంలో ఏర్పడిన కొత్త సమస్యలు తీర్చాలని భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. దీని కోసం విపక్షాల మద్దతు సైతం కూడగట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాగా నిన్న లాంగ్ మార్చ్ ను విజయవంతంగా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. అయితే అధికార వైసిపి మాత్రం... లాంగ్ మార్చ్ అనేది పవన్ ఆలోచన కాదని చంద్రబాబు ఆలోచన పవన్  అమలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. నారా లోకేష్ చంద్రబాబు నిజమైన పుత్రుడు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాజకీయ దత్తపుత్రుడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపైన చాలా రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. 

 

 

 

 పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడని... పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఎజెండా లేదని చంద్రబాబు ఇచ్చిందని పవన్ కళ్యాణ్  పాటిస్తారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్... బాబు గారు ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం వల్లే దత్త పుత్రుడు అయిన పవన్ అధికార వైసీపీ పై విమర్శలు చేస్తున్నారని.. చంద్రబాబు చెప్పడం వల్లే లాంగ్ మార్చ్ కూడా నిర్వహించాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు పవన్ విడిపోయామని చెబుతున్నప్పటికీ వీరిద్దరి లాంగ్ జర్నీ నిన్న జరిగిన లాంగ్ మార్చ్  వరకు కూడా కలిసే ఉందంటూ వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: