సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అసలు కెసియార్ హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయలేదు. కెసియార్ ఎంత గట్టిగా హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా పెద్ద షాకే ఇచ్చారు. 5వ తేదీ రాత్రిలోగా విధుల్లో చేరకపోతే ప్రభుత్వం చేయగలిగిన సహాయం ఏమి ఉండదంటూ కెసియార్ బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఇంకేముంది కెసియార్ చేసిన తీవ్ర హెచ్చరికల తర్వాత వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెను వదిలేసి ఉద్యోగాల్లో చేరిపోతారని అనుకున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి ఎంతమంది విధుల్లో చేరారో తెలుసా ? కేవలం 12 అంటే 12 మంది మాత్రమే. వాళ్ళు కూడ ఆఫీసు స్టాఫ్ మాత్రమే. అందులోను వాళ్ళంతా తొందరలోనే రిటైర్ అవ్వబోతున్న ఉద్యోగులు.

 

ఏ స్ధాయి ఉద్యోగైనా రిటైర్ అయ్యేరోజుకు కచ్చితంగా విధినిర్వహణలో ఉండితీరాలనే నిబధనుంది. సరే ఇపుడు చేరిన వారంతా 4వ తేదీన రిటైర్ కాకపోయినా ఈనెలలలోనే ఉద్యోగ విరమణ చేయబోతున్నారట. అందుకనే రిటైర్ తర్వాత అందాల్సిన బెనిఫిట్స్ అందుకునేందుకు అవసరమైన సంతకాలు చేయటానికి, పేపర్లు రెడీ చేసుకుని సబ్మిట్ చేయాల్సిన పనులుండటం వల్లే విధుల్లో చేరారని సమాచారం.

 

కెసియార్ గడువు ప్రకారం 5వ తేదీ అర్ధరాత్రికి సమ్మెలో ఉన్న సుమారు 43 వేల మంది చేరాలి. కానీ అంత సీన్ ఉన్నట్లు కనపించటం లేదు. ఎందుకంటే గతంలోనే సమ్మె చేస్తున్న వాళ్ళంతా సెల్ఫ్ డిస్మిస్ అని ప్రకటించిన కెసియార్ తాజాగా అందరూ విధుల్లో చేరాలని కోరటమేంటి ? అప్పట్లో డిస్మిస్ అయిపోతే ఇపుడు విధుల్లో ఎలా చేరుతారు ?

 

అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను బట్టి సమ్మె చేస్తున్న వారెవరూ కెసియార్ హెచ్చరికలను లెక్క చేయటం లేదన్న విషయం అర్ధమైపోయింది. ఇప్పటికే సుమారు 22 మంది కార్మికులు, ఉద్యోగులు మరణించారు. వీళ్ళ మరణంతో కార్మికసంఘాల నేతలందరు కూడా చాలా గట్టిగా తయారైనట్లు తెలుస్తోంది. ఒకవైపు కెసియర్ మరోవైపు కార్మిక నేతలు గట్టిగా పట్టుబట్టడంతో చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: