తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గోరపరాజయం తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ ఎలా అన్నారు  ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసానని కానీ కాంగ్రెస్ పార్టీ లో కొందరి తప్పుల వాళ్ళ మరియు ఒంటెద్దు పోకటవల్లా పరాజయాన్ని మూటగట్టుకున్నాం అని తెలియచేసారు. అయితే జగ్గారెడ్డి . కేసీఆర్ ని హరీష్ రావు ని పొగడడం కేటీర్ ని ఎత్తుకోవడం మరియు వారి  పథకాలంటే అద్భుతమైన పథకాలు అని మెచ్చుకోవడం చూస్తే అతడు కచ్చితంగా తెరాస లోకి చేరుతున్నదని అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ ని వీడేది లేదు అని ప్రకటించాడు.


అలాగే ఈ వార్తల్ని ఎప్పటికప్పుడే ఖండిస్తున్నా తాజాగా మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో చేరమని ఆహ్వానాలు వస్తున్నాయంటూ వారు చూపించే ప్రేమకు ధన్యవాదములు అని కానీ నేను పార్టీ ని వీడేది లేదు అని బదులిచ్చాడు.కాంగ్రెస్ పార్టీ  సీఎం అబ్యర్థి పదవి ఆశించడకుండా పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు. జగ్గారెడ్డి. అదిష్టానం పీసీసీ పదవి ఎవరికి ఇచ్చినా అందరం కలసి పనిచేయాలని ఆయన అన్నారు. ఈ విషయమై ఇటివల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలుస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ లో కష్టపడేవారిని గుర్తించాల్సిన అవసరం రాహుల్ గాంధీ కి ఉందని, లేకుంటే భవిష్యత్ అంధకారమేనని సంగారెడ్డి జగ్గారెడ్డి  స్పష్టం చేశారు.  తెలంగాణ లో పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు క‌రువౌతోంద‌ని ఆరోపించారు. కులాలకు, మతాలకు సంబంధం లేకుండా సమర్దుడికి అధ్యక్ష  బాధ్యతలు అప్పజెప్పాలని ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి విజ్ఞ‌ప్తి చేసారు.


ప్రజలు ఎవరిని, ఏ నాయకత్వాన్ని కోరుకుంటారో వారికి ప్రాధాన్యత ఇస్తే అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అన్న‌రు. తెలంగాణలో కాంగ్రెస్‌కు గడ్డు కాలం నడుస్తోంది అని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చేజారుతుంటే.. హస్తం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని ఏ మద్యే జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా చాల నిరాశపరిచాయని  పార్టీకి నమ్మిన కార్యకర్తలంతా టీఆర్ఎస్ గూటికి చేరిపోతున్నారు అన్నారు.


అయితే ఉప ఎన్నికలలో మరియు సాధారణ ఎన్నికలలో గోరా పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోవాలని అది జగ్గారెడ్డి వైపు ఢిల్లీ వర్గాలు చూస్తున్నాయి అని సమాచారం. ఈ మద్యే ఉపఎన్నికలలో ఓడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి సతీమణిని  హుజుర్ నగర్ ఉపఎన్నికల రంగం లోకి దింపడం ఓడిపోవడం అన్ని పరిగణ లోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షున్ని ప్రకటించాలని చూస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: