ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. దీంతో  భవన నిర్మాణ రంగ కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో  ఏర్పడిన  ఇసుక కొరత సమస్యను తీర్చి  నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. అయితే లాంగ్ మార్చ్ అనంతరం వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై అటు విజయసాయిరెడ్డి కూడా తాజాగా ట్విట్టర్ వేదికగా ఘాటుగానే స్పందించారు విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి పవన్ కళ్యాన్ పై సెటైర్లు వేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ తో వైజాగ్ లో లాంగ్ మార్చ్  పూర్తి చేసి విజయవంతం అయ్యిందని పించాడని ... పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజి  స్టార్  అంటూ విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. 



 రాజకీయాల్లో కూడా కాల్షీట్ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి నిజాయితీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తక్కువ చేసి మాట్లాడొద్దు అంటూ పవన్ అంటున్నారని.... ఈమాట ప్రజలను అడుగుతున్నా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా  నిన్న లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్  విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సూట్ కేసు  కంపెనీలు ఉండే విజయసాయిరెడ్డి కూడా తనను విమర్శిస్తున్నారు అంటూ  పవన్ కళ్యాణ్ అన్నారు. పరిధికి మించి మాట్లాడితే తాటతీస్తామంటూ విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ నేపథ్యంలోనే  పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించినట్లు  తెలుస్తోంది. కాగా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కొనసాగింది. కాగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్  2.5 కిలోమీటర్ల మేర కొనసాగింది. అయితే దీనిపై కూడా వైసిపి సెటైర్లు గుప్పించిన విషయం తెలిసిందే. రెండున్నర కిలోమీటర్ల దూరం మార్చ్  చేపట్టడాని కూడా లాంగ్ మార్చ్ అని పేరు పెట్టడం ఎందుకు అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. 



 ఇదిలా ఉండగా రాష్ట్రంలో రోజురోజుకు ఇసుక సమస్య తీవ్రమవుతుంది. గత ఐదు నెలల నుంచి ఇసుక సమస్య ఏర్పడడంతో భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్తాపం చెంది చాలా మంది కార్మికులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలంటూ ఇప్పటికే టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే దీనిపై కూడా వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. లోకేష్ ఇసుక కోసం దీక్ష చేసినట్లు లేదని డైటింగ్ కోసమే దీక్ష చేసినట్లు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: