ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. అందులో భాగంగా జనసేన పార్టీ..నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ మార్చ్‌కు టీడీపీ మద్దతు పలికింది. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన‌ లాంగ్ మార్చ్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ ఇసుక ఆందోళనను..లాంగ్ మార్చ్ అంటుంటే..ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  


మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ దత్త పుత్రుడని కొంద‌రు వైసీపీ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు. ప‌వ‌న్ పై అటువంటి అభియోగాలు రావడానికి కార‌ణాలు లేక‌పోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ టిడిపి, బిజెపిల‌కు ఎన్నిక‌ల్లో తాను  పోటీ చెయ్య‌కుండా ఆ రెండు పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు.  తిరిగి మ‌ళ్లీ వాళ్ళ‌తో ప్ర‌త్యేక హోదా గొడ‌వ‌లు రావ‌డం వ‌ల్ల‌ టిడిపి, బిజెపితో విభేధించి ప్ర‌త్యేక హోదా పై ఆయ‌న పార్టీ త‌ర‌పున‌ ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌శ్నించ‌డానికి పార్టీ పెట్టిన ఆయ‌న ప్ర‌త్యేక హోదా విష‌యంలో మిగిలిన రెండు పార్టీల‌తో విభేధాలు వ‌చ్చాయి. తిరిగి 2019ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి కేవ‌లం ఒక్క స్థానం గెలుచుకుని ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. వీట‌న్నిటిని బ‌ట్టి  అధికారంలో లేన‌ప్పుడు వైసీపీని ప‌వ‌న్ విమ‌ర్శించారు. ఇప్పుడు కూడా  వైసీపీని దెబ్బ‌తియ్య‌డం కోసం టీడిపి వ‌ద్ద ప్యాకేజ్ తీసుకున్నా ర‌న్న అభియోగం వ‌చ్చింది. ప్యాకేజ్‌లు పుచ్చుకుని లాంగ్ మార్చ్ చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. లోకాకారంగా వైసీపీని దెబ్బ‌తియ్య‌డానికి ప‌వ‌న్ కేవ‌లం టిడిపి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చ‌ద‌వ‌డం ఆయ‌న‌కు అల‌వాట‌యింద‌ని సినిమాల్లో రెమ్యూన‌రేష‌న్ పుచ్చుకుని న‌టించ‌డం ఎలా అలవాటో ఇక్క‌డ కూడా ప్యాకేజ్‌లు పుచ్చుకోవ‌డం కామ‌న్ అయిపోయింద‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు అభివర్ణించారు. 


విశాఖ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన్ను హెచ్చరించారు. చంద్రబాబు దత్తపుత్రుడు, టీడీపీ టీమ్-బీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదన్న జనసేనాని.. జీవితంలో చాలా చూసి వచ్చానని చెప్పారు. ఆయన చిందులేస్తే ఎలా కట్టడి చేయాలో తనకు బాగా తెలుసని స్పష్టంచేశారు పవన్ కళ్యాణ్. తాను ఏ పార్టీకి ద‌త్త‌పుత్రుడను కాన‌ని కేవ‌లం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ద‌త్త‌పుత్రుడ‌ని నిన్న జ‌రిగిన స‌భ‌లో ప‌వ‌న్  అన్నారు. చంద్రబాబు అడుగుజాడ‌ల్లోనే ప‌వ‌న్ న‌డ‌వ‌డం వ‌ల్ల అంద‌రూ ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడు అని అంటున్నారు. బాబు వెన‌కుండి ప‌వ‌న్‌తో ఇలాంటివి చేయిస్తున్నారా నేరుగా ఆయ‌న సీన్‌లోకి రాకుండా ప‌వ‌న్‌ను అస్త్రంగా వాడుతున్నార‌ని కొంద‌ర‌ని కొంద‌రి అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: