గతంలో 370 ఆర్టికల్ రద్దు తో ప్రధానమంత్రి మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ని వేరు వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి భారతదేశ కొత్త చిత్రపటాన్ని తాజాగా కేంద్రం విడుదల చేసింది. అయితే కేంద్ర విడుదల చేసిన కొత్త చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కనుమరుగయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోసారి ఈ అంశంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు  జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో రాష్ట్ర ప్రతిష్ట ఇంతగా దిగజారిపోయిందో...  ఈ కొత్త భారతదేశ చిత్రపటం చెబుతుంది అంటూ  ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు చేసారు . అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉందా లేక అమరావతిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారా...  ఇప్పుడు చిత్రపటంలోని కనబడడం లేదు రేపు అసలు ఉంటుందో లేదో అన్న అనిశ్చితి నెలకొంది అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మౌనం వీడి సమాధానం చెప్పాలంటూ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. 



 అయితే దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని మార్పు చేస్తానంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏకంగా రాష్ట్ర రాజధానిని దేశ  చిత్రపటంలో లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు. అయితే ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకపోవడం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్ము కాశ్మీర్ ఇటీవలే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయి దీనికి సంబంధించిన నూతన భారత రాజకీయ చిత్రపటాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రపటంలో ప్రతీ రాష్ట్ర రాజధాని సూచిస్తూ రాజధాని పేర్లను ఎర్రటి అక్షరాలతో  చిత్రపటంలో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు మాత్రం చిత్రపటంలో పేర్కొనలేదు.దీంతో  ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రగడ మొదలైంది. 



 ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత వివాదం కూడా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కరవై మనస్థాపానికి గురై  ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండడం తో దీనిపై ప్రతిపక్షాలన్ని ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి.ఇసుక కొరత   సమస్యను  తీర్చాలంటూ ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టగా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్  నిర్వహించారు . ఇప్పటికే ఇసుక కొరత సమస్యపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష పార్టీలు... తాజాగా  కేంద్రం కొత్తగా విడుదల చేసిన దేశ చిత్రపటంలో రాజధాని పేరు కనుమరుగవడం కూడా మరో వివాదానికి దారి తీసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: