ఆర్టికల్ 370 రద్దు ఆరువాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకలు అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.  వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్నది.  జమ్మూ కాశ్మీర్ పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మరకముందే రెండుసార్లు ఉగ్రవాదులు గ్రనేడ్ తో దాడులు చేశారు.  మొదట శ్రీనగర్ లో పహారా కాస్తున్న సైనికులపై ముష్కరులు గ్రనేడ్ దాడులు చేశారు.  


ఈ దాడిలో ఆరుగురు సైనికులకు గాయాలయ్యాయి.  ఆర్మీ వెంటనే రియాక్ట్ కావడంతో.. ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.  కాగా, మొన్నటి రోజున సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు.  ఈ దాడిలో సామాన్య ప్రజలు గాయపడ్డారు.  ఇప్పుడు తాజాగా శ్రీనగర్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులు చేశారు.  ఈ గ్రనేడ్ దాడిలో 11 మంది పౌరులకు గాయాలయ్యాయి.  


దీంతో ఆర్మీ రియాక్ట్ అయ్యింది.  ముష్కరులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలపై దృష్టి పెట్టింది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ముష్కరులు వరస దాడులు చేస్తున్నారు.  జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా 300 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ ఉగ్రవాదులే దాడులు చేస్తున్నారని ప్రాధమిక సమాచారం.  సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే.. కేంద్రంపై ఒత్తిడి వస్తుంది.. ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్ధరించేందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఈ దాడులు జరుగుతున్నాయి.  


అయితే, కొంతమంది మాత్రం.. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఇండియా చూస్తోందని, దాని నుంచి దృష్టి మరల్చాలి అంటే.. ఇలా జమ్మూ కాశ్మీర్లో దాడులు జరిగేలా చూడాలని అందుకే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, కాశ్మీర్లో ఉన్న సానుభూతి పరులతో కలిసి ఈ దాడులు చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు.  ఏది ఏమైనా.. ఇలా ముష్కరులు దాడులు చేస్తుండటం... ముష్కరుల దాడిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైన అంశం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: